చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థదే, ఆ అధికారం కోర్టులకు లేదు: మూడు రాజధానుల చర్చలో ధర్మాన

By narsimha lode  |  First Published Mar 24, 2022, 2:29 PM IST


మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక అంశాలను ప్రస్తావించారు. 


అమరావతి:చట్టాలు చేసే అధికారం కేవలం శాసన వ్యవస్థకే ఉన్న విషయాన్ని రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో గురువారం నాడు మూడు రాజధానుల అంశం (పాలనా వీకేంద్రీకరణ)పై స్వల్పకాలిక చర్చను మాజీ మంత్రి Dharmana Prasada rao ప్రారంభించారు.  Three Capitals అంశంపై AP High Court తీర్పు వచ్చిన తర్వాత తాను సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు.హైకోర్టు తీర్పు తర్వాత న్యాయ నిపుణులతో చర్చించినట్టుగా ఆయన చెప్పారు. దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఎందైనా ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. 

ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులతో పాలన చేయాలని Constitutionచెప్పింది. ప్రజాభిప్రాయం కేవలం శాసన వయవస్థలోనే ప్రభావితం అవుతుందన్నారు. శాసనసభ అధికారాల విషయంలో కోర్టుకు అభ్యంతరాలుంటే ఎన్నికలెందుకని ఆయన ప్రశ్నించారు.శాసనసభను ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్నుకొన్నారన్నారు.

Latest Videos

undefined

న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాల్సిన అవసరం ఉందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.  ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ధర్మాన ప్రసాదరావు గుర్తు చేశారు. మూడు వ్యవస్థల్లో ప్రజాభిప్రాయాన్ని తెలిపేది శాసన వ్యవస్థేనని ఆయన చెప్పారు. లోక్‌సభ, శాసనసభల్లోని సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకొంటున్నారని ధర్మాన చెప్పారు. 

శాసన. న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు వాటి విధులపై స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు  ఆ స్పష్టత ఇప్పటికీ లేదంటే మనం ఆలోచన చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.ఏ అంశాలపై స్పష్టత లేదో ఆ అంశాలపై స్పష్టత కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు.కోర్టులంటే అందరికీ గౌరవం ఉందన్నారు.

న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించకూడదన్నారు.   అధికార విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని మాజీ మంత్రి తెలిపారు. ఈ స్పఫ్టత రాకుంటే వ్యవస్తల్లో గందరగోళం వచ్చే అవకాశం ఉందన్నారు.సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలోనే ప్రకటించిన విషయాన్ని ధర్మాన ఈ సందర్భంగా ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థతో పాటు మిగిలిన రెండు వ్యవస్థలు కూడా సమానమేనని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు.ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని ధర్మాన తెలిపారు. ఒకవేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ప్రజలే చూసుకుంటారన్నారు.

కానీ శాసన వ్యవస్థ విదుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గతంలో చెప్పిన తీర్పులను ధర్మాన సభలో వివరించారు.జ్యుడిషీయల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని కూడా  ఉన్నత న్యాయస్థానం చెప్పిందన్నారు. ఎవరు ఎక్కవ ఎవరు తక్కువ కాదనే విషయాన్ని కోర్టులు గుర్తు పెట్టుకోవాలన్నారు. అయితే మూడు వ్యవస్థలకు సమానమైన హక్కులు, అధికారాలు ఉన్నాయని  కోర్టు తీర్పులున్నాయని ధర్మాన తెలిపారు.

 రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవాలన్నారు. కానీ ప్రాదేశిక సూత్రాల ఉల్లంఘన జరిగితే కోర్టుల పరిధి జోక్యం వరకేనని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జడ్జిలు న్యాయాన్ని మాత్రమే చెప్పగలరు, కానీ చట్టాన్ని రూపొందించలేరని జస్టిస్ వర్మ జడ్జిమెంట్ ను ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీలో చెప్పారు. శాసనకర్త పాత్రను కోర్టులు పోషించకూడదని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.  లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేమని సుప్రీంకోర్టు తీర్పుల్లో స్పష్టంగా ఉందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. కోర్టులు ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు, ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు తెలిపిందన్నారు.
 

click me!