జగన్‌తో యుద్ధమంటే రాజకీయంగా సమాధే: అచ్చెన్నకి కొడాలి నాని కౌంటర్

By narsimha lode  |  First Published Mar 24, 2022, 1:33 PM IST


జగన్‌తో యుద్ధమంటే టీడీపీకి రాజకీయ సమాధేనని ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని చెప్పారు. ఇవాళ టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు.


అమరావతి:జగన్ తో యుద్ధమంటే టీడీపీకి రాజకీయ సమాధేనని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు.

గురువారం నాడు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి kodali Nani  మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు కౌంటరిచ్చారు.

Latest Videos

2024 ఎన్నికల్లో చంద్రబాబుకు రాజకీయ సమాధిని జగన్ కడతారని చెప్పారు. పది కిలోమీటర్ల లోతున గొయ్యి తీసి టీడీపీకి YS Jaganరాజకీయ సమాధి కడతారన్నారు.  

కమిషన్లు తీసుకుని పార్టీని పడిపేది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు.రాష్ట్రంలో డిస్టిలరీలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో నిన్న Assembly వేదికగా ఆధారాలతో సహా  చూపించిన విషయాన్ని మంత్రి నాని గుర్తు చేశారు. liquor బ్రాండ్లు ఎవరు అనుమతిచ్చారని నాని ప్రశ్నించారు. తాము  ఆధారాలతో బయటపడితే ఏం చెప్పాలో దిక్కు తోచక  మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన రోజూ మాట్లాడిన  అంశాలనే  TDP నేతలు చెబుతున్నారన్నారు. 

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను మూసివేశామన్నారు. అంతేకాదు మద్యం దుకాణాలను తగ్గించినట్టుగా మంత్రి గుర్తు చేశారు. Chandrababu Naidu అధికారాన్ని కోల్పోయే ముందు  ఇచ్చిన అనుమతులను దృష్టిలో ఉంచుకొని  బార్ల యజమానులు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకొని  నడిపిస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లకు  ఎలా బార్లకు అనుమతి ఇచ్చారని నాని ప్రశ్నించారు.  కమిషన్లకు కక్కుర్తి పడి ఐదేళ్లకు బార్లకు అనుమతి ఇచ్చారన్నారు. 

వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడికి పేటేంట్ దారుడని  మంత్రి నాని చెప్పారు.అల్లుడని చంద్రబాబును ఎన్టీఆర్ పార్టీలో చేర్చుకొంటే చివరికి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబును నమ్మొద్దని కూడా ఎన్టీఆర్ ఆనాడు చెప్పాడన్నారు.కానీ ఆయన మాటలను వినకపోవడంతోనే ఇవాళ ఈ సమస్యలు వస్తున్నాయన్నారు. 

ఎన్టీఆర్ నుండి టీడీపీని చంద్రబాబు లాక్కొన్న తర్వాత  చంద్రబాబు మద్యపానంపై నిషేధాన్ని ఎత్తివేశారన్నారు. ఆనాడు మద్యపాన నిషేధాన్ని ఎందుకు ఎత్తివేశారో చెప్పాలని మంత్రి నాని టీడీపీని డిమాండ్ చేశారు. 

click me!