Thatiparthi Murder Case : లేడీ టెక్కీ హత్యకు వాడిన గన్ ఎక్కడిది?

Published : May 10, 2022, 08:24 AM ISTUpdated : May 10, 2022, 08:31 AM IST
Thatiparthi Murder Case : లేడీ టెక్కీ హత్యకు వాడిన గన్ ఎక్కడిది?

సారాంశం

తిరుపతి లేడీ టెకీ కావ్య హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నెల్లూరులో జరిగిన ఈ ఘటనలో హత్యకు వాడిన గన్ ఎక్కడి నుంచి వచ్చిందన కోణంలో విచారణ చేస్తున్నారు. 

తిరుపతి : Software Engineer కావ్యపై నెల్లూరు జిల్లా తాటిపర్తిలో Firing జరిపి తాను కాల్చుకున్న సురేష్ రెడ్డి వ్యవహారంపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సురేష్ రెడ్డికి gun ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆయనకు సహకరించిన మిత్రుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. సురేష్ రెడ్డికి చెందిన రెండు Cell phone dataను సేకరిస్తున్నారు. 

సురేష్ రెడ్డి వాడిన గన్ తో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే, సురేష్ రెడ్డి కావ్యపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. మరోటి తనను కాల్చుకోవడానికి వాడాడు. మీగతా రెండు రౌండ్ల బుల్లెట్లను ఎక్కడ వాడారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. సురేష్ రెడ్డి ఏయే ఫోన్ నెంబర్లు వాడారు, ఎవరెవరికి ఫోన్లు చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సురేష్ రెడ్డి వాడిన గన్ మీద మేడ్ ఇన్ అమెరికా అని ఉంది. గన్ అతను బెంగళూరులో సేకరించాడా, మరెక్కడ సహకరించారనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టారు. వయసు తేడా రీత్యా కావ్య తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించలేదని తెలుస్తోంది. ఇరువురి మధ్య 13 ఏళ్ల తేడా ఉంటుంది. ఇరువురి శవాలు కూడా ఆస్పత్రిలో ఉన్నాయి. వాటికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

కాగా,  సోమవారం సాయంత్రం కావ్యరెడ్డిపై కాల్పులు జరిపి మాలపాటి సురేష్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు  తాటిపర్తిలో మీడియాతో మాట్లాడారు. మాలపాటి సురేష్ రెడ్డి ఉపయోగించిన తుపాకీపై మేడిన్ యూఎస్ఏ అని రాసి ఉందన్నారు. అయితే, ఈ తుపాకీ ఇక్కడే తయారు చేసి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. 

సోమవారం మధ్యాహ్నం కావ్యరెడ్డి ఇంటికి వెళ్లిన సురేష్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. కావ్యను పెళ్లి చేసుకోవాలని సురేష్ రెడ్డి భావించాడు. ఈ విషయమై కావ్య కుటుంబ సభ్యులతో చర్చించాడు. చర్చించాడు. అయితే, కావ్య, సురేష్ రెడ్డితో పెళ్ళికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సురేష్ రెడ్డి సోమవారం కావ్య ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను కూడా తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సురేష్ రెడ్డి, కావ్యలు గతంలో చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోం లో భాగంగా వీరిద్దరూ సొంత ఊర్లనుంచే పనులు చేస్తున్నారు. వీరిద్దరిదీ ఒకే ఊరు. అంతేకాదు సురేష్ రెడ్డి దుందుడుకు స్వభావం ఉన్న వ్యక్తి అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

సురేష్ రెడ్డి ఓ పైకో : కావ్య బంధువు
సురేష్ రెడ్డి ఓ సైకో అని కావ్య బంధువు ఒకరు తెలిపారు. సురేష్ రెడ్డి గురించి అతని సన్నిహితులు చాలామంది నెగటివ్ గా  చెబుతున్నారన్నారు. కావ్య పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్లే కక్షతో సురేష్ రెడ్డి  ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. సురేష్ రెడ్డి గురించి తమకు ఇంతకు ముందు ఈ విషయాలు తెలియవని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ కంటే హైదరాబాద్ లోనే లోయెస్ట్ టెంపరేచర్స్ .. స్కూల్ టైమింగ్స్ చేంజ్
YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu