
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడు భార్గవ్ తేజ్ కథ విషాదాంతమైంది. గత ఆదివారం కన్పించకుండా పోయిన బాలుడి మృతదేహం సోమవారం ఇంటికి సమీపంలోని పొలాల్లో లభ్యమైంది. బాలుడి మిస్సింగ్, హత్యకు సంబంధించిన వివరాలను తాడేపల్లి సీఐ అంకమ్మ రావు వివరించారు.
ఈ ఘటనపై మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబం చెప్పిన అనుమానాల అధారంగా లోతుగా విచారణ చేస్తున్నామన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని వివిధ కోణాలలో విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.
read more అదృశ్యమైన బాలుడి అనుమానాస్పద మృతి: ఏం జరిగింది?
''బాలుడు చనిపోయిన సమయంలో అంటే రాత్రి11 గంటల సమయంలో బాలుడి ఇంటివెనుక రోడ్డులో కుక్కలు బాగా మొరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో ఎవరు బయటకు వచ్చారు... రావడాని కారణాలు ఎమిటి అనే కోణంలో విచారణ సాగిస్తున్నాం'' అన్నారు.
''బాలుడి పోస్ట్ మార్టం నివేదిక కోసం చూస్తున్నాం. పోస్ట్ మార్టం నివేధిక అధారంగా కేసును మరికొంత లోతుగా విచారిస్తాం. బాలుడు హత్య పై ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలి'' అని సీఐ సూచించారు.