కాకినాడలో విషాదం చోటు చేసుకుంది. కారులోకి వెళ్లి డోర్ వేసుకోవడంతో ఊపిరాడక ఓ బాలిక మరణించింది. అపస్మార స్థితిలో ఉన్న బాలికను కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ చిన్నారికి ఎనిమిదేళ్లు. ఎప్పటిలాగే ఇంటి పరిసరాల్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో బాలిక కారులోకి వెళ్లింది. తలుపులు వేసుకుంది. అయితే అనుకోకుండా కార్ డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ పాపకు ఊపిరి ఆడకపోవడంతో మరణించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో చోటు చేసుకుంది.
హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే కాల్చి చంపేస్తాం - కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలంలోని కోలంక గ్రామంలో ఆదిలక్ష్మి పలు ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు ఆరో తరగతి చదువుతుండగా.. ఎనిమిదేళ్ల కుమార్తె అఖిలాండేశ్వరి మూడో తరగతి చదువుతోంది. భర్త ఏడాది కిందటే చనిపోయారు. దీంతో కుటుంబ భారం మొత్తం ఆమే చూసుకుంటోంది.
వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. ఆదివారం కూతురు అఖిలాండేశ్వరి ఇంటి పరిసరాల్లో ఆడుకుంటోంది. అయితే మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ వెళ్లి ఇంటి సమీపంలో ఉన్న ఓ కారులో కూర్చుంది. తలుపులు వేసుకుంది. అయితే కారు డోర్ లాక్ అవడంతో ఆమె బయటకు రాలేకపోయింది. తలుపులన్నీ వేసి ఉండటంతో ఆమెకు ఊపిరికూడా ఆడటం కష్టంగా మారింది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు ఉన్నాయి - ప్రధాని నరేంద్ర మోడీ..
బాలిక కారులోకి వెళ్లడం ఎవరూ గమనించకపోవడంతో గంటల తరబడి అందులోనే ఉండిపోయింది. అయితే అఖిలాండేశ్వరి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. కానీ ఆ బాలిక జాడ దొరకలేదు. అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ఆ కారు యజమాని చిన్నారి పరికిణీ వాహనం డోర్ దగ్గర ఉండటం గమనించాడు. వెంటనే డోర్ తెరిచి చూశాడు. అందులో బాలిక అపస్మారక స్థితిలో పడి ఉంది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.
అయితే అప్పటికి బాలిక కొన ఊపిరితో ఉందని భావించి వెంటనే యానాంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తరువాత డాక్టర్లు పరీక్షించి, బాలిక మరణించిందని ప్రకటించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. భర్త చనిపోయినా బిడ్దలను చూసుకుంటూ ఆ తల్లి ఆదిలక్ష్మి జీవనం సాగిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాత్సల్య స్కీమ్ కు కూతురిని దరఖాస్తు చేయిద్దామనే ఉద్దేశంతో ఆమె రెండు రోజుల కిందట అవసరమైన పత్రాలను సేకరించారు. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఈ ఘటనతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గొల్లపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.