టెన్త్ క్లాస్ లో ఫెయిల్:విశాఖలో విద్యార్ధి అదృశ్యం, ఆత్మహత్య చేసుకొన్నాడా?

Published : Jun 06, 2022, 10:19 PM ISTUpdated : Jun 06, 2022, 10:27 PM IST
 టెన్త్ క్లాస్ లో ఫెయిల్:విశాఖలో విద్యార్ధి అదృశ్యం, ఆత్మహత్య చేసుకొన్నాడా?

సారాంశం

 విశాఖ జిల్లాలో టెన్త్ క్లాస్ లో పెయిల్ కావడంతో పేరేంట్స్ మందలించడంతో సాయి అనే విద్యార్ధి కన్పించకుండా పోయాడు. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులు గుర్తించారు. పోలీసులు సాయి కోసం గాలిస్తున్నారు. సాయి ఆత్మహత్య చేసుకొన్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.


విశాఖపట్టణం:Tenth తరగతి పలితాల్లో ఫెయిల్ కావడంతో పేరేంట్స్  మందలించడంతో  Sai అనే విద్యార్ధి అదృశ్యమయ్యాడు. Visakhapatnam జిల్లాలోని వేపగుంట అప్పల నర్సయ్య కాలనీకి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్ధి సాయి అదృశ్యమయ్యాడు. 

ఇవాళ ప్రకటించిన టెన్త్ క్లాస్ పరీక్షల్లో సాయి రెండు సబ్జెక్టుల్లో పెయిల్ అయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన Parents సాయిని మందలించారు. దీంతో సాయి ఇంటి నుండి వెళ్లిపోయాడు. మేఘాద్రిగడ్డ డ్యామ్ వద్ద సాయి సెల్ ఫోన్, చెప్పులను పోలీసులు గుర్తించారు. డ్యామ్ లో దూకి సాయి ఆత్మహత్య చేసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను  ఇవాళ విడుదల చేశారు. ఈ ఏడాది మాత్రం గ్రేడ్‌ల రూపంలో కాకుండా మార్కుల రూపంలో ఉంటాయని అధికారులు అధికారులు ఇదివరకే ప్రకటించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు వచ్చే నెల 6 నుంచి 15 వరకు సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. వారి కోసం స్పెషల్ క్లాసెస్‌ ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పారు. 

పదో తరగతిలో 67.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలు పైచేయి సాధించారు. ఉత్తీర్ణ శాతం బాలికల్లో 70.70 శాతం, బాలురలో 64.02 శాతంగా ఉంది. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫలితాల్లో 78.3 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా   49.7 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం ఆఖరిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు.

ఇక, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. మొత్తం 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌గా.. 6,22,537 మంది పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించారుమరోవైపు పరీక్షల ఫలితాలు వెలువరించాక  విద్యాసంస్థలు, పాఠశాలలు తమ విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ జూన్‌ 1న 83వ నంబరు జీవో జారీచేశారు. ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్ట్‌–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu
చంద్రబాబు, పవన్‌పై 420 కేసులు పెట్టాలి: RK Roja Strong Comments on TDP, JSP | Asianet News Telugu