మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన వ్యక్తి: విద్యార్థి మృతి, గ్రామంలో ఉద్రిక్తత

Published : Mar 29, 2021, 08:34 AM IST
మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన వ్యక్తి: విద్యార్థి మృతి, గ్రామంలో ఉద్రిక్తత

సారాంశం

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో పకోడీ బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి మరణించాడు.

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పకోడీ బండి వద్ద చెలరేగిన ఘర్షణ ఓ బాలుడి హత్యకు దారి తీసింది. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో చోటు చేసుకుంది. 

మద్యం మత్తులో కొవ్వూరి వీరబాబు అనే వ్యక్తి పకోడీ బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఏసు, శివగా గుర్తించారు. వారిద్దరిని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివ మరణించాడు. అతను పదో తరగతి చదువుతున్నాడు.

విద్యార్థి మరణంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu