చంద్రగిరిలో కొట్లాట: వైసీపీ, టీడీపీ ఏజెంట్లు పరస్పర దాడి

By Nagaraju penumalaFirst Published May 23, 2019, 8:26 AM IST
Highlights

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ అలజడి నెలకొంది. చంద్రగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లు దాడులకు దిగారు.  చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ అలజడి నెలకొంది. చంద్రగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లు దాడులకు దిగారు.  చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 

చివరకు ఆయా పార్టీల అభ్యర్థులు ధర్నాలకు దిగిన పరిస్థితి కూడా నెలకొంది. ఇకపోతే రీ పోలింగ్ విషయంలోనూ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి.  ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!