విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత: ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్‌ను అడ్డుకొన్న కార్మికులు

By narsimha lodeFirst Published Mar 9, 2021, 10:27 AM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం నాడు  తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ను కార్మికులు నిర్భంధించారు.

విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం నాడు  తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ను కార్మికులు నిర్భంధించారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  సోమవారం నాడు రాత్రి నుండి  విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు, నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడు  ఉదయం ప్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు వచ్చిన ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ను కార్మికులు, నిరసనకారులు అడ్డుకొన్నారు.

వేణుగోపాల్ కారును అడ్డగించారు. ఆయనను ఫ్యాక్టరీ లోపలకి వెళ్లకుండా అడ్డగించారు. వేణుగోపాల్ కారుకు ఉన్న నేమ్ ప్టాట్ ను తొలగించారు. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది 

ఫ్యాక్టరీ వద్ద బందోబస్తులో ఉన్న సీఐఎస్ఎప్ పోలీసులు వేణుగోపాల్ ను ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.  

ఫ్యాక్టరీలోకి ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా కార్మికులు అడ్డుకొన్నారు. 

click me!