మళ్ళీ తగ్గిన కేసులు.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,90,766కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Mar 08, 2021, 07:35 PM ISTUpdated : Mar 08, 2021, 08:08 PM IST
మళ్ళీ తగ్గిన కేసులు.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,90,766కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా పెరిగిన కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా పెరిగిన కరోనా కేసులు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 74 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,90,766కి చేరింది. కోవిడ్ వల్ల నిన్న గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 7,176కి చేరుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 1006 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు కోవిడ్ నుంచి 61 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,581కి చేరింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో 25,907 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం టెస్టుల సంఖ్య 1,42,62,086కి చేరుకుంది.

నిన్న కొత్తగా అనంతపురం 0, చిత్తూరు 29, తూర్పుగోదావరి 5, గుంటూరు 2, కడప 5, కృష్ణా 8, కర్నూలు 13, నెల్లూరు 2, ప్రకాశం 1, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 2, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 0 కేసులు నమోదయ్యాయి. 

 

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu