మాజీ మంత్రికి సుప్రీంలో చుక్కెదురు: నారాయణ పిటిషన్ డిస్మిస్

By narsimha lode  |  First Published Feb 27, 2023, 2:24 PM IST

 
మాజీ మంత్రి నారాయణ  దాఖలు  చేసిన  పిటిషన్ ను సుప్రీంకోర్టు  ఇవాళ డిస్మిస్  చేసింది.  



న్యూఢిల్లీ: మాజీ మంత్రి నారాయణకు  సుప్రీంకోర్టులో  చుక్కెదురైంది.  మాజీ మంత్రి నారాయణ దాఖలు  చేసిన పిటిషన్ ను   సుప్రీంకోర్టు సోమవారం నాడు డిస్మిస్  చేసిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్  ఎన్టీవీ కథనం ప్రసారం  చేసింది.   

టెన్త్  క్లాస్ పేపర్ల లీకేజీ కేసు విషయమై   మాజీ మంత్రి నారాయణ  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్ పై  ఇవాళ  సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.  ఈ పిటిషన్ పై  సెషన్స్  కోర్టులో  విచారణ  చేపట్టాలని  సుప్రీంకోర్టు  ఆదేశించింది.  మెరిట్  ఆధారంగానే  విచారణ కొనసాగించాలని  సుప్రీంకోర్టుఆదేశించింది . సెషన్స్  కోర్టు ఉత్తర్వులపై  వారంలో  హైకోర్టుకు  వెళ్లవచ్చని  సుప్రీంకోర్టు తేల్చి  చెప్పింది.  అప్పటివరకు  చర్యలు తీసుకోవద్దని  సుప్రీంకోర్టు  ఆదేశించింది. .

Latest Videos

undefined

also readమాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట: ఏపీ హైకోర్టు ఆర్డర్ పై స్టే

2022  ఏప్రిల్  27వ తేదీన  చిత్తూరు జిల్లా గంగాధర  మండలం  నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో  టెన్త్ క్లాస్  తెలుగు ప్రశ్నా పత్రం లీకైంది.   ఈ కేసులో  నారాయణ విద్యా సంస్థల పాత్ర ఉందని మాజీ మంత్రి నారాయణను పోలీసులు అరెస్ట్  చేశారు. పక్కా పథకం ప్రకారంగానే   టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాలు  లీకైనట్టుగా  పోలీసులు  ప్రకటించారు. అయితే  నారాయణ విద్యాసంస్థలతో  తనకు సంబంధం లేదని మాజీ మంత్రి నారాయణ ప్రకటించారు.  2014  కు ముందే  నారాయణ విద్యా సంస్థలకు  తాను  రాజీనామా ప్రకటించారు. ఈ కేసులో  మాజీ మంత్రి నారాయణకు  2022 మే 11న  కోర్టు  బెయిల్  మంజూరు చేసిన విషయం తెలిసిందే.
 


 

click me!