టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో చుక్కెదురు.. ఆ కేసులో దర్యాప్తుకు అనుమతి..

Published : Feb 27, 2023, 01:54 PM IST
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో చుక్కెదురు.. ఆ కేసులో దర్యాప్తుకు అనుమతి..

సారాంశం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించిన దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతించింది.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించిన దర్యాప్తునకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 467 కింద అయ్యన్నపాత్రుడిని దర్యాప్తు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. 

కేసు ఏమిటంటే.. అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో తన ఇంటి నిర్మాణం కోసం సమర్పించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసి)లో తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నీటిపారుదల శాఖ ఈఈ ఫిర్యాదు చేయడంతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనేనీటిపారుదల శాఖ జారీ చేసిన ఎన్‌ఓసి విలువైన భద్రత నిర్వచనం పరిధిలోకి రాదని.. అందువల్ల సెక్షన్ 467 కేసుకు వర్తించదని హైకోర్టు పేర్కొంది. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. 

ఈ క్రమంలోనే అయ్యన్నపాత్రుడుపై నమోదైన ఫోర్జరీ కేసులో ఐపీసీ సెక్షన్ 467 వర్తించదని, అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను అనుసరించాలని హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసం తాజాగా అయ్యన్నపాత్రుడిపై విచారణకు అనుమతించింది. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Visit:రీల్స్ చూడకుండా మంచిగా చదవండి.. మంచి ఉద్యోగాలు వస్తాయి| Asianet News Telugu
Venkaiah Naidu Strong Remarks on Freebies: రాజకీయ పార్టీలను జనం ప్రశ్నించాలి | Asianet News Telugu