పరవాడ సాల్వెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత: మాజీ మంత్రి బండారు సహా విపక్ష నేతల అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 14, 2020, 12:36 PM IST
Highlights

 విశాఖపట్టణం పరవాడ సాల్వెంట్ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొన్నాయి.  ఈ ఫ్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.


విశాఖపట్టణం: విశాఖపట్టణం పరవాడ సాల్వెంట్ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకొన్నాయి.  ఈ ఫ్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

పరవాడ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం నాడు రాత్రి 11 గంటల సమయంలో  ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు.

విశాఖపట్టణంలోని ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడంపై  విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సీపీఐ నేత జేవీ సత్యనారాయణ, మాజీ మంత్రి, టీడీపీ నేత  బండారు సత్యనారాయణ మూర్తిల నేతృత్వంలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

also read:విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం: కెమిస్ట్ శ్రీనివాస్ గల్లంతు, ట్యాంకర్లు పేలి...

ఫ్యాక్టరీ గేటు  బయటే మోహరించిన పోలీసులు టీడీపీ, సీపీఐ కార్యకర్తలను అడ్డుకొన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, సీపీఐ నేత సత్యనారాయణల,ను అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు.

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్, సాయినార్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకొంది.ఈ రెండు ఘటనలు మరువక ముందే సోమవారం నాడు రాత్రి సాల్వెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


 

click me!