కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ అడ్డుకుంటాం : శివరామ్ బాధితుల వార్నింగ్, టెన్షన్

By narsimha lode  |  First Published Jun 8, 2023, 12:12 PM IST

పల్నాడు జిల్లాలోని  ముప్పాళ్ల మండలం  రుద్రవరంలో  కోడెల శివప్రసాదరావు విగ్రహవిష్కరణ అడ్డుకుంటామని  కోడెల  శివరామ్  బాధితులు  ఆందోళనకు దిగారు.


గుంటూరు:పల్నాడు  జిల్లాలోని  ముప్పాళ్ల మండలం  రుద్రవరం గ్రామంలో  కోడెల శివప్రసాదరావు  విగ్రహన్ని అడ్డుకుంటామని   కోడెల శివరామ్ బాధితులు  చెబుతున్నారు. కోడెల శివప్రసాదరావు  విగ్రహన్ని ఆవిష్కరించి తీరుతామని  శివరామ్  వర్గీయులు  చెబుతున్నారు. 

కోడెల శివరామ్   తమ వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడని కొందరు  ఆరోపిస్తున్నారు.ఈ డబ్బులు చెల్లించకుండా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.  రూ. 60 లక్షలు ఇస్తానని  కోడెల శివరామ్  మధ్యవర్తులకు  ఒప్పుకున్నాడని బాధితులు  ఆరోపిస్తున్నారు. కానీ  ఇంతవరకు  తమకు డబ్బులు చెల్లించలేదని  బాధితులు  ఆరోపిస్తున్నారు. రుద్రవరం గ్రామంలో ఏర్పాటు  చేసిన  కోడెల శివరామ్  బాధితులు  ధర్నాకు దిగారు.  తమ అప్పులు చెల్లించాలని  వారు  డిమాండ్  చేశారు. తమ అప్పులు చెల్లించాలని  గ్రామంలో  ఫ్లెక్సీలు  ఏర్పాటు చేశారు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత నెలకొంది.  దీంతో  పోలీసులు గ్రామానికి  చేరుకున్నారు. ఇరు వర్గాలకు  నచ్చజెప్పారు.  అయితే  డబ్బులు చెల్లించని విషయమై   ఫిర్యాదు చేస్తే  కేసులు నమోదు  చేస్తామని  పోలీసులు బాధితులకు   హామీ ఇచ్చారు. అయితే  విగ్రహవిష్కరణ  కార్యక్రమంలో  శాంతి భద్రతల  సమస్య  తలెత్తకుండా   పోలీసులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
కోడెల శివప్రసాదరావు  బతికున్న సమయంలో కూడ కోడెల శివరామ్ పై  పలు  ఆరోపణలు వచ్చాయి.  ఏపీలో వైసీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల శివప్రసాదరావుపై  కేసులు  నమోదయ్యాయి.   ఈ సమయంలో  పలువురు  కోడెల శివరామ్  బాధితులు  పోలీసులకు ఫిర్యాదులు  చేసిన విషయం తెలిసిందే

Latest Videos

click me!