ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో చెత్త సేకరణకు గాను ఈ ఆటోలను ఏపీ సీఎం గురువారంనాడు ప్రారంభించారు.
అమరావతి: మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు అవసరమైన ఈ ఆటోలను గురువారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 36 మున్సిపాలిటీలకు ఈ ఆటోలను పంపిణీ చేశారు సీఎం జగన్. 36 మున్సిపాలిటీలకు 516 ఆటోలను అందించింది ప్రభుత్వం . ఈ ఆటోలను తాడేపల్లిలో సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 123 మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. రూ. 72 కోట్లతో 40 లక్షలకు పైగా కుటుంబాలకు బుట్టలను పంపిణీ చేశారు.గ్రేడ్ 1 , ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2500 పెట్రోల్, డీజీల్, సీఎన్ జీ వాహనాలను ఉపయోగిస్తున్నారు.