రామతీర్థంలో ఉద్రిక్తత: పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట, సొమ్మసిల్లిన సోమువీర్రాజు

By narsimha lode  |  First Published Jan 7, 2021, 10:26 AM IST

విజయనగరం జిల్లా రామతీర్థంలో గురువారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ ఘటనలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు.
 
రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు గురువారం నాడు ప్రయత్నించారు. రామతీర్థం జంక్షన్ వద్ద పోలీసులు బీజేపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకొన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది.

Latest Videos

ఈ తోపుటాటలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొమ్మసిల్లిపడిపోయాడు. బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడ సొమ్మసిల్లి పడ్డాడు.కొండపై దేవాలయాన్ని చూసిన తర్వాతే తాము ఇక్కడి నుండి వెళ్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

గత ఏడాది డిసెంబర్ మాసంలో  రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు ఈ గుడిని పరిశీలించారు.ఈ ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

click me!