బోయినపల్లి కిడ్నాప్ కేసు.. అఖిల ప్రియ గర్భిణీ కావడంతో..

By telugu news teamFirst Published Jan 7, 2021, 9:13 AM IST
Highlights

రిమాండ్ అనంతరం  అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు కిడ్నాప్ కి గురైన సంఘటన తెలుగు రాష్ట్రాల్లోకలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఓ భూమి వ్యవహారంలో ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిల ప్రియను పోలీసులు అరెస్టు చేశారు.

బుధవారం ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు గత రాత్రి చంచల్ గూడ జైలుకు తరలించారు. రిమాండ్ అనంతరం  అఖిల ప్రియ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరగనున్నాయి. అయితే అఖిల ప్రియ గర్భవతి కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. అఖిలప్రియను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

మరోవైపు ఈ కేసుకు సంబంధించి అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. భార్గవ్ రామ్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నారు. A1 గా ఉన్న ఏవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు... విచారణ అనంతరం 41 సీఆర్పీ నోటీసు ఇచ్చి వదిలేశారు. కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ఇంకా చూపించలేదు. హఫీజ్‌పేట్‌లోని భూ వివాదమే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు తేల్చిచెప్పారు.

click me!