పశ్చిమ గోదావరి కొవ్వూరులో వలస కార్మికులపై పోలీసులు సోమవారం నాడు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై కార్మికులు రాళ్ళు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఏలూరు: పశ్చిమ గోదావరి కొవ్వూరులో వలస కార్మికులపై పోలీసులు సోమవారం నాడు లాఠీచార్జీ చేశారు. పోలీసులపై కార్మికులు రాళ్ళు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు టోల్ గేట్ గోదావరి మాత విగ్రహం వద్ద వలస కార్మికులు రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. తమను స్వగ్రామాలకు పంపాలని వలస కార్మికులు డిమాండ్ చేశారు.
undefined
రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. తాము తమ స్వంత గ్రామాలకు వెళ్తామని అక్కడే బైఠాయించారు. ఈ సమయంలో వలస కార్మికులు పోలీసులపై రాళ్లు రువ్వారు.
కార్మికులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. లాఠీచార్జీ చేస్తున్న పోలీసులపై కార్మికులు దూరం నుండి రాళ్లు విసిరారు. దీంతో కొద్దిసేపు ఈ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రోడ్డుపైనే కూర్చొపెట్టి ఉన్నతాధికారులతో పోలీసులు చర్చిస్తున్నారు.
also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: స్వగ్రామానికి చేరుకొనేందుకు 115 కి.మీ కాలినడక
వలస కార్మికులు బీహార్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. ఇవాళ ఉదయం నుండి కూలీలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. వాహానాలు లేకపోతే తాము నడుచుకొంటూ వెళ్తామని కూడ వలస కార్మికులు తేగేసి చెప్పారు. తాము వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.