లాక్‌డౌన్ ఎఫెక్ట్: స్వగ్రామానికి చేరుకొనేందుకు 115 కి.మీ కాలినడక

Published : May 04, 2020, 11:13 AM IST
లాక్‌డౌన్ ఎఫెక్ట్: స్వగ్రామానికి చేరుకొనేందుకు  115 కి.మీ కాలినడక

సారాంశం

తన స్వంత గ్రామానికి చేరుకొనేందుకు ఓ గర్భిణి 115 కి.మీ దూరం నడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన అనంతపురం వాసులు ఆమెకు ఆశ్రయం కల్పించారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రత్యేక వాహనంలో ఆమెను స్వంత గ్రామానికి తరలించారు.  

అనంతపురం:తన స్వంత గ్రామానికి చేరుకొనేందుకు ఓ గర్భిణి 115 కి.మీ దూరం నడిచింది. ఈ విషయాన్ని గుర్తించిన అనంతపురం వాసులు ఆమెకు ఆశ్రయం కల్పించారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రత్యేక వాహనంలో ఆమెను స్వంత గ్రామానికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సలోని తన కుటుంబంతో కర్ణాటక రాష్ట్రంలోని చెల్లికెరకు వలస వెళ్లింది. సలోని ప్రస్తుతం 8 నెలల గర్భిణి.
లాక్ డౌన్ కారణంగా కుటుంబంతో ఆమె అక్కడే ఉంది. అయితే వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 

also read:గుంటూరు రెడ్‌జోన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐకి కరోనా: కుటుంబ సభ్యులు క్వారంటైన్ కి

దీంతో రెండు రోజుల క్రితం ఆమె తన కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులతో కలిసి కాలినడకన ఏపీ రాష్ట్రానికి బయలుదేరింది. చెల్లికెర నుండి కాలినడకన కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణించింది. ఆదివారం నాడు సలోని అనంతపురం పట్టణానికి చేరుకొంది.

గర్భిణీ కాలినడకన ప్రయాణం చేస్తున్న విషయాన్ని చూసిన పద్మావతి ఆమెకు భోజనం ఏర్పాటు చేసింది. పద్మావతి సీటీఓ కార్యాలయంలో  పనిచేస్తున్నారు. భోజనం చేసిన తర్వాత సలోనిని పద్మావతి ఆమె గురించి విచారించారు. గర్భిణిని విషయం తెలుసుకొన్న స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఆమెకు దైర్యం చెప్పారు.

గర్భిణి సలోని తన స్వంత గ్రామం ప్రకాశం జిల్లాకు వెళ్లేందుకు గానను కలెక్టర్ , ఎస్పీతో పద్మావతితో పాటు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అనుమమతి ఇచ్చింది. దీంతో సలోనితో పాటు ఆమె కుటుంబసభ్యులను ప్రత్యేక వాహనంలో అనంతపురం నుండి ప్రకాశం జిల్లాకు తరలించారు.


 

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu