ఏపీలోకి అనుమతించని పోలీసులు: భర్త శవంతో మహిళ రాత్రంతా జాగారం

By telugu teamFirst Published May 4, 2020, 10:52 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లోకి ఆ రాష్ట్ర పోలీసులు తెలంగాణ నుంచి లోనికి అనుతించడం లేదు. ఓ మహిళ తన భర్త శవంతో గత రాత్రంతా సరిహద్దులోనే జాగారం చేసింది. మెడికల్ సర్టిఫికెట్ ఉన్నా అనుమతించడం లేదని అంటోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో పరిస్థితి పునరావృతమవుతోంది. తెలంగాణ నుంచి తమ రాష్ట్రంలోకి ప్రజలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుమతించడం లేదు. ఓ మహిళ గత రాత్రి అంతా ఏపీ సరిహద్దులో తన భర్త మృతదేహంతో జాగారం చేసింది. తమ స్వగ్రామానికి అనుమతించాలని ఆమె పోలీసులను కోరుతోంది.

మెడికల్ సర్టిఫికెట్ ఉన్నా కూడా తనను అనుమతించడం లేదని మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే, డీజీపీ లేఖ ఉంటేనే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆమె తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తమ స్వస్థలానికి వెళ్లాలని కోరుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నిరీక్షిస్తున్నవారిలో గర్భిణీలు కూడా ఉన్నారు. 

లాక్ డౌన్ ఆంక్షల్లో సడలింపు ఇచ్చి వలస కూలీలను, విద్యార్తులను తమ స్వగ్రామాల్లోకి అనుమతించిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రజలు బారులు తీరారు. దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

తెలంగాణలోని వలసకూలీలు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయినప్పటికీ ఏపీ పోలీసులు వారిని అనుమతించడం లేదు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసకుుంది. సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ శ్రీధర్ బాబు పరిస్థితిని సమీక్షించారు. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావద్దని ఆయన చెప్పారు.

click me!