భోగాపురం పరిసర గ్రామాల్లో ఉద్రిక్తత:గ్రామాలు ఖాళీ చేసేందుకు నిర్వాసితుల ససేమిరా

By narsimha lodeFirst Published Feb 10, 2023, 2:54 PM IST
Highlights

విజయనగరం జిల్లా భోగాపురం  ఎయిర్ పోర్టు  నిర్వాసితులు  గ్రామాలు  ఖాళీ చేసేందుకు  నిరాకరిస్తున్నారు. నిర్వాసితులకు  టీడీపీ, జనసేన  మద్దతుగా నిలిచాయి.  

హైదరాబాద్:విజయనగరం  జిల్లా భోగాపురం  ఎయిర్ పోర్టు  నిర్వాసితులను తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే  ఇళ్ల  కూల్చివేతను   టీడీపీ, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. 

నిర్వాసిత గ్రామాలకు  జేసీబీలు, ట్రాక్టర్లతో  అధికారులు శుక్రవారం నాడు వచ్చారు. 2015లో  ప్రభుత్వం  ప్రకటించిన ప్యాకేజీ ఇచ్చేవరకు   గ్రామాలు ఖాళీ చేయబోమని  బాధితులు  చెబుతున్నారు బాధితులకు  విపక్షాలు అండగా నిలుస్తున్నాయి.  

భోగాపురం గ్రీన్ ఫీల్డ్  ఎయిర్ పోర్టు నిర్మాణం పనులను  ఈ ఏడాది మార్చి మాసంలో  ప్రారంభించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఈ లోపుగానే  నిర్వాసిత గ్రామాల నుండి  ప్రజలను ఖాళీ చేయించాలని  ప్రభుత్వం  భావిస్తుంది.  అయితే  ప్యాకేజీతో పాటు  ఇతర డిమాండ్ల విషయమై  కొందరు  ఆందోళనకు దిగుతున్నారు. 

నిర్వాసితులకు  ప్రభుత్వం నుండి ప్యాకేజీతో  పాటు ఇతర సదుపాయాలు  కల్పించినా  గ్రామాలను ఎందుకు ఖాళీ చేయడం లేదని అధికారులు ప్రశ్నించారు.  అయితే  తమకు గడువిస్తే  తాము గ్రామాలను ఖాళీ చేసి వెళ్తామని  అధికారులకు  చెబుతున్నారు.  ప్రభుత్వం ఇచ్చిన  ఆర్ధిక సహయం  సరిపోవడం లేదని  నిర్వాసితులు  చెబుతున్నారు. మరో వైపు 18 ఏళ్లు నిండిన వారికి  కూడా  ఇళ్లు ఇతర సౌకర్యాలు  కల్పిస్తామని  ఇచ్చిన హమీని అమలు చేయాలని  నిర్వాసితులు కోరుతున్నారు.


 

click me!