ధర్మవరంలో మార్కెట్‌లో దుకాణాల తొలగింపు: వ్యాపారుల అరెస్ట్,ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Oct 24, 2021, 9:45 AM IST
Highlights

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్‌లో దుకాణాల తొలగింపు విషయమై  ఆదివారం నాడు ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకొంది. పాత భవనాల కూల్చివేతను వ్యాపారులు, టీడీపీ నేతలు అడ్డుకొన్నారు. వ్యాపారులు,టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతపురం: అనంతపురం జిల్లా Dharmavaram పట్టణంలోని vegetable మార్కెట్‌లో  దుకాణాల తొలగింపు సందర్భంగా ఆదివారం నాడు తెల్లవారుజామున ఉద్రిక్తత చోటు చేసుకొంది.ఇదే మార్కెట్ స్థలంలో కొత్త  shops నిర్మాణం కోసం పాత భవనాలను  తొలగిస్తున్నారు. అయితే పాత  భవనాల కూల్చివేతను కొంత కాలంగా వ్యాపారులు అడ్డుకొంటున్నారు.  ఇవాళ ఉదయం Jcb ల సహాయంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య  అధికారులు కూరగాయల మార్కెట్‌లో పాత భవనాలను కూల్చివేశారు.ఈ విషయం తెలిసిన వ్యాపారులు అక్కడికి చేరుకొని భవనాల కూల్చివేతను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. పోలీసులు, అధికారులతో వ్యాపారులు వాగ్వాదానికి దిగారు.

also read:కూరగాయల జ్యూస్ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

కొత్త భవనాల నిర్మాణం కోసం  వ్యాపారులు ఒక్కొక్కరు రూ. 10 లక్షలు చెల్లించాలని ధర్మవరం మున్సిపాలిటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే  కొత్త భవనాల నిర్మాణం కోసం  డబ్బులు చెల్లించని 40 భవనాలను అధికారులు ఇవాళ తొలగించారు.మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ ఇద్దరు వ్యాపారులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకొన్నారు. దీంతో ఈ రెండు దుకాణాల కూల్చివేతను అధికారులు నిలిపివేశారు.

కూరగాయల మార్కెట్ లో భవనాల కూల్చివేత కార్యక్రమాన్ని నిరసిస్తూ వ్యాపారులకు మద్దతుగా టీడీపీ నేతలు నిలిచారు. భవనాల కూల్చివేతను అడ్డుకొన్న వ్యాపారులు, టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భవనాల కూల్చివేత పూర్తయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

click me!