గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్.. అక్టోబరు జీతాల్లో కోత..!

Published : Oct 24, 2021, 09:38 AM IST
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఊహించని షాక్.. అక్టోబరు జీతాల్లో కోత..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్‌ తగిలింది. రెండేళ్ల సర్వీసు పూర్తికావడంతో  ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి  ఊహించని పరిణామం ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్‌ తగిలింది. రెండేళ్ల సర్వీసు పూర్తికావడంతో  ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న వారికి  ఊహించని పరిణామం ఎదురైంది. బయోమెట్రిక్ హాజరు (Biometric Attendance) లేదని  అక్టోబరు  జీతంలో 10 నుంచి  50 శాతం వరకు తగ్గించారు. ఈ మేరకు సెప్టెంబర్  23 నుంచి అక్టోబర్  22 వరకు హాజరుకు సంబంధించిన డేటా  జిల్లాలకు చేరింది. వీటి ఆధారంగానే ఉద్యోగులకు  జీతాలను వేయాలని సంబంధిత అధికారులను గ్రామ, వార్డు  సచివాలయ  శాఖ ఆదేశించింది. 

దీంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. బయోమెట్రిక్‌ మెషీన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించకుండా తమ జీతాల్లో కోత విధించడమేంటని grama ward sachivalayam employees ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు మండల అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి జీతాల్లో కోతలు విధించకుండా జీతాలు (Employees Salaries) ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బయోమెట్రిక్ హాజరు యాప్‌తో సంబంధం లేకుండా గతంలో లానే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని, అలాగే, ప్రొబేషన్ ప్రక్రియను పూర్తి చేసి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Also read: అతడికి 17.. ఆమెకు 26.. పెళ్లి చేసుకున్న నెల రోజుల తర్వాత భార్యను అమ్మేశాడు.. చివరకు..

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించింది. ఈ ఏడాది అక్టోబరు 2తో తొలుత విధుల్లో చేరిన  గ్రామ, వార్డు  సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీసు పూర్తైంది. దీంతో వారు ప్రొబేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్