ఎల్జీ పాలీమర్స్ వద్ద ఉద్రిక్తత: ఫ్యాక్టరీ ముందు వెంకటాపురం వాసుల ధర్నా

By narsimha lodeFirst Published May 19, 2020, 4:33 PM IST
Highlights

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ వద్ద మంగళవారం నాడు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.పోలీసులతో గ్రామస్తులు వాగ్వావాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.


విశాఖపట్టణం:విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ వద్ద మంగళవారం నాడు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.పోలీసులతో గ్రామస్తులు వాగ్వావాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకొంది.దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఈ నెల 7వ తేదీన ఎల్జీ పాలీమర్స్  ఫ్యాక్టరీ నుండి స్టైరైన్ గ్యాస్ లీకైంది. దీంతో 12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.ఈ ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు అస్వస్థతకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందించింది.

also read:చంద్రబాబే అనుమతులిచ్చారు: ఎల్జీ పాలీమర్స్ బాధితులతో వైఎస్ జగన్

అయితే వెంకటాపురం గ్రామస్తులు తమకు న్యాయం చేయాలని ఇవాళ ఫ్యాక్టరీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకొన్నారు. 
ఈ గ్యాస్ ప్రభావంతో ఇతర గ్రామాల కంటె తమ గ్రామమే ఎక్కువ నష్టపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇతర గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తూ తమ గ్రామాన్ని విస్మరిస్తున్నారని వెంకటాపురం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులతో గ్రామస్తులు  వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఎల్జీ పాలీమర్స్ బాధిలుతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. గ్యాస్ లీకేజీ బాధ్యులైన వారిని ఉపేక్షించబోమని హామీ ఇచ్చారు. అంతేకాదు బాధిత గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు జారీ చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
 

click me!