ఆలూరు వెళ్లకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డగింత: తాడిపత్రిలో ఉద్రిక్తత

Published : Apr 06, 2023, 04:58 PM IST
ఆలూరు వెళ్లకుండా జేసీ  ప్రభాకర్ రెడ్డి అడ్డగింత: తాడిపత్రిలో  ఉద్రిక్తత

సారాంశం

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు  ఇవాళ  అడ్డుకున్నారు.  ఆలూరు రంగనాథస్వామి రథోత్సవంలో  పాల్గొనకుండా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు.  


అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని  తాడిపత్రిలో  గురువారంనాడు  ఉద్రిక్తత  నెలకొంది.  మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని  ఆలూరుకు వెళ్లకుండా  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో  పోలీసులతో  జేసీ ప్రభాకర్ రెడ్డి  వాగ్వాదానికి దిగారు. ఆలూరు రంగనాథస్వామి  ఆలయ రథోత్సవానికి వెళ్లకుండా  అడ్డుపడడంపై   పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం  చేశారు. ఆలూరులో రంగనాథస్వామి  రథోత్సవరం కార్యక్రమానికి  ఎమ్మెల్యే  కేతిరెడ్డి  పెద్దారెడ్డి హాజరు కానున్నారు. ఇదే  కార్యక్రమానికి  జేసీ ప్రభాకర్ రెడ్డి కూడ హాజరైతే   శాంతి బద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని  పోలీసులు భావించారు.  దీంో  ఆలూరు రంగనాథస్వామి  రథోస్వానికి  జేసీ ప్రభాకర్ రెడ్డిని వెళ్లకుండా  పోలీసులు  అడ్డుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతోంది ముఖ్యమంత్రి ఎక్కడ: లక్ష్మీ పార్వతి | Lakshmi Parvathi Comments
సచివాలయం ఉద్యోగులు VS పోలీస్ లు విజయవాడ ధర్నా చౌక్ వద్ద హై టెన్షన్ | Secretariat Employees Dharna