టీడీపీ నేత అరవింద్ ప్రయాణీస్తున్న అంబులెన్స్ పై రాళ్ల దాడి: జొన్నలగడ్డలో ఉద్రిక్తత

By narsimha lode  |  First Published Jan 15, 2022, 9:48 PM IST

గుంటూరు జిల్లాలోని నర్సరావుపేట నియోజకవర్గంలోని జొన్నలగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకొంది. వైఎస్ఆర్ విగ్రహం మాయం చేశారని అనిల్, రాజేష్ అనే టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.ఈ ఇద్దరిని విడుదల చేయాలని టీడీపీ రాస్తారోకో నిర్వహించింది. పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీచార్జీ చేశారు.


నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలోని శనివారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. Tdp శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకొంది. ఈ క్రమంలో టీడీపీ నర్సరావుపేట ఇంచార్జీ  Chadalavada Aravinda Babu అస్వస్థతకు గురయ్యారు. ఆయనను Ambulance లో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి దిగారు.వైసీపీ వాళ్లే అంబులెన్స్ పై రాళ్లతో దాడికి దిగారని టీడీపీ ఆరోపిస్తోంది.దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

Narasaraopet లోని jonnalagaddaలో వైఎస్ఆర్ విగ్రహన్ని కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.  అయితే Ysr విగ్రహన్ని ధ్వంసం చేసింది టీడీపీ శ్రేణులేనని Ycp  ఆరోపించింది. జొన్నలగడ్డకు చెందిన Rajesh, Anil అనే టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే  అనిల్, రాజేష్ లను విడుదల చేయాలని కోరుతూ ఇవాళ జొన్నలగడ్డలో  రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. వైఎస్ విగ్రహాన్ని వైసీపీ నేతలే మాయం చేశారని  టీడీపీ నేత చదలవాడ అరవింద బాబు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. పోలీసులకు టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 
 

Latest Videos

చదలవాడ అరవింద్ బాబు కు అస్వస్థత

తోపులాటలో అరవింద్ బాబుతో సహా పలువురికి గాయాలయ్యాయి. నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చదలవాడకు చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి  అరవింద్ బాబు ఇబ్బంది పడుతున్నాడని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అరవింద్ బాబుకు  బిపి డౌన్ అయిందని, ఈసీజీలో గుండె కొట్టుకోవడంలో స్వల్ప మార్పులు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు.

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి.  గుంటూరు జిల్లా గుండ్లపాడు టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చంద్రయ్యను హత్య చేసిన నిందితులను 24 గంటల వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేశారు.  చంద్రయ్య బైక్‌పై వెళ్తుండగా ఆపి నిందితులు కత్తులతో దాడి చేసినట్టుగా పోలీసులు చెప్పారు. 
ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింతా శివరామయ్యకు చంద్రయ్యకు పాత గొడవలు ఉన్నాయని చెప్పారు. చంద్రయ్య, శివరామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారని తెలిపారు. గత కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు.

తోట చంద్రయ్య శివరామకృష్ణను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని, అతని మీద తప్పకుండా దాడి చేస్తాడని కొంత మంది గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అతడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే చంద్రయ్య  అతడిపై దాడి చేయకముందే చంద్రయ్యపై దాడి చేయాలని శివరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మిగిలిన నిందితులతో కలిసి హత్య చేశారు. అన్ని ఆధారాలతో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశాం’ అని ఎస్పీ వెల్లడించారు.

ప్రస్తుతం శివరామయ్య వెల్దుర్తి ఎంపీపీగా ఉన్నట్టు తెలిపారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. ఈ  కేసులో  చింత శివ రామయ్య, చింత యలమంద కోటయ్య, సాని రఘు రామయ్య, సాని రామకోటేశ్వరరావు , చింతా శ్రీనివాసరావు,  తోట ఆంజనేయులు, తోట శివ నారాయణ, చింతా ఆదినారాయణ.లను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ తెలిపారు.

click me!