వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారులో డెడ్‌బాడీ: సుబ్రమణ్యం మృతదేహం పోస్టుమార్టం అడ్డుకున్న ఫ్యామిలీ, ఉద్రిక్తత

Published : May 20, 2022, 09:45 AM ISTUpdated : May 20, 2022, 10:13 AM IST
వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారులో డెడ్‌బాడీ: సుబ్రమణ్యం మృతదేహం పోస్టుమార్టం అడ్డుకున్న ఫ్యామిలీ, ఉద్రిక్తత

సారాంశం

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో అనుమానాస్పదస్థితిలో ఆయన వద్ద కారు డ్రైవర్ గా పనిచేసిన సుబ్రమణ్యం మరణించి ఉండడం కలకలం రేపుతుంది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించకుండా పోలీసులను కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

కాకినాడ: YCP ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ అలియాస్ బాబు అలియాస్ అనంతబాబు   వద్ద గతంలో  పనిచేసిన డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పదస్థితిలో మరణించి ఉండడం కలకలం రేపుతోంది. 

Subramanyam  నివాసం ఉండే అపార్ట్ మెంట్ వద్దకు సుబ్రమణ్యం మృతదేహం ఉన్న కారును తీసుకొచ్చిన ఎమ్మెల్సీ  Ananta Uday Babu కారును అక్కడే వదిలి వెళ్లాడు.  గురువారం నాడు రాత్రి యాక్సిడెంట్ అయిందని సుబ్రమణ్యం సోదరుడికి  YCP MLC  ఉదయబాబు ఫోన్ లో సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే  ఎమ్మెల్సీ ఉదయబాబు డెడ్ బాడీ ఉన్న మృతదేహన్ని కారులో తీసుకొచ్చారని కటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ డెడ్ బాడీ ఉన్న కారును సుబ్రమణ్యం నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వద్దే వదిలి వెళ్లాడు ఎమ్మెల్సీ ఉదయ్ బాబు. 

సుబ్రమణ్యం చనిపోవడానికి ఎమ్మెల్సీ ఉదయబాబే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీని శుక్రవారం నాడు ఉదయం పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా సుబ్రమణ్యం కుటుంబసభ్యులు, బంధువులు అడ్డుకున్నారు.

also read:వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో మృతదేహం..!

  సుబ్రమణ్యం ఎమ్మెల్సీ వద్ద కారు డ్రైవర్ గా పనిచేశాడు. ఎమ్మెల్సీ ఉదయ్ బాబుకు సుబ్రమణ్యం రూ. 20 వేలు బకాయి ఉన్నాడు. ఈ విషయమై సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ ఉదయ్ బాబు అడిగేవాడని చెబుతున్నారు. కొంత సమయం ఇస్తే ఈ డబ్బులు తిరిగి ఇస్తామని సుబ్రమణ్యం ఎమ్మెల్సీకి చెప్పారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు.

 గురువారం నాడు ఉదయం ఇంటికి వచ్చి సుబ్రమణ్యాన్ని ఎమ్మెల్సీ తీసుకువెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంటి నుండి వెళ్లిన సుబ్రమణ్యాన్ని డెడ్ బాడీగా తీసుకొచ్చాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం తరలించకుండా పోలీసులను బంధువులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వం నుండి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది. పోలీసులతో బాధిత కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు ఎమ్మెల్సీ ఉదయ్ బాబు పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారని సమాచారం.  ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఉదయ్ బాబును ఎమ్మెల్సీ కొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  మృతదేహన్ని అంబులెన్స్ లో తరలించకుండా అడ్డుకున్నారు. అంబులెన్స్ కు అడ్డంగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు  కూడా మృతుడి కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు.  సుబ్రమణ్యానికి ప్రమాదం జరిగినట్టుగా అన్పించడం లేదని కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుబ్రమణ్యం చనిపోిడానికి  డబ్బుల వ్యవహరమే కారణమా ఇంకా ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!