కొడుకును కొట్టి చంపిన తండ్రి, సహకరించిన కుటుంబసభ్యులు... ఆత్మహత్య అంటూ కలరింగ్.. చివరికి కోడలు రావడంతో...

By SumaBala BukkaFirst Published May 20, 2022, 7:29 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో దారుణమైన ఘటన జరిగింది. తండ్రీ కొడుకుల మధ్య చెలరేగిన చిన్న వివాదం చివరికి కొడుకును హత్య చేసేలా చేసింది. ఆ తరువాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీంతో...
 

చీరాల : Family disputes నేపథ్యంలో చోటు చేసుకున్న వివాదంలో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు దాడి చేయడంతో కొడుకు murderకు గురైన సంఘటన పర్చూరు మండలం ఏదుబాడులో చోటుచేసుకుంది. సంఘటన స్థలంలో Blood stains చెరిపివేసి Suicideగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో హత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై లక్ష్మీ భవాని తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పొనుగుపాటి ఏసురత్నం (28)  అదే గ్రామానికి చెందిన నీలిమ ప్రియాంకను 2014లో love marriage చేసుకున్నాడు. మొదట్లో ఏసురత్నం కుటుంబ సభ్యులు దీనికి వ్యతిరేకించినా.. కొంతకాలం తర్వాత కలిసిపోయారు.

 నీలిమ, ఏసురత్నం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. మద్యానికి అలవాటుపడిన ఏసురత్నం భార్య, కుటుంబ సభ్యులను తరచూ వేధిస్తుండేవాడు. ఈ నెల 15న మద్యం సేవించి గొడవ చేయడంతో భార్య ఏదుబాడు వచ్చింది.  17న తల్లితో కలిసి మేదరమెట్లలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్ళింది. భార్యను తీసుకురావడానికి తండ్రిని రమ్మని కోరాడు ఏసురత్నం. మద్యం సేవించి గొడవ పడుతూ ఉంటే.. ఏ భార్య అయినా ఎలా వస్తుందని.. ఏ మొహం పెట్టుకుని మేమైనా నీతో ఎలా రావాలని తండ్రి అనడంతో  వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో కుమారుడిపై తండ్రి తో పాటు కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

తల, ఇతర శరీర భాగాలలో బలమైన గాయాలు కావడంతో  కొద్దిసేపటికే ఏసురత్నం మృతిచెందాడు. అయితే, రక్తపు మరకలు కావడం అనుకోకుండా చనిపోవడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. హత్య చేసినట్లు అనుమానం వస్తుందని భయంతో  శరీరంపైనా, గదిలోనూ కనిపించకుండా రక్తపు మరకలు తుడిచేశారు. మేదరమెట్లలో ఉంటున్న మృతుని భార్య నీలిమా  ప్రియాంకకు గురువారం సాయంత్రం ఫోన్ చేసి పురుగుల మందు తాగి చనిపోయినాడు అని ఆమె మామ సమాచారం అందించాడు.  దీంతో కంగారుగా బంధువులతో కలిసి గ్రామానికి వచ్చి శరీరంపై ఉన్న గాయాలు చూసి ఆందోళన పడి  నిలదీసింది.

బుధవారం అర్ధరాత్రి సమయంలో పర్చూరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఎస్సై లక్ష్మీ భవాని  వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.  గురువారం ఉదయం ఇంకొల్లు సీఐ సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రులతో పాటు అతని సోదరి, బావపై హత్య, సాక్ష్యాలు లేకుండా చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 

click me!