ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరేషాన్

Published : May 20, 2018, 02:16 PM IST
ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరేషాన్

సారాంశం

టెన్షన్.. టెన్షన్..

అవును పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా పరేషాన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ కారణంగానే వారు పరేషాన్ అవుతున్నారు. ఫ్యాన్స్ ను పవన్ ఎందుకు పరేషాన్ చేస్తారబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

జనసేన ప్రజా పోరాట యాత్రపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్ లేకుండా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ యాత్ర సాగుతోంది. చివరి క్షణంలో బస్సుయాత్రకు బదులు సొంత కారులో పవన్ యాత్ర చేస్తున్నారు. దీంతో పవన్‌ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

జిల్లాలో ఎన్ని రోజులు యాత్ర చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. కార్యక్రమాలు వివరాలు తెలియకపోవడంతో అభిమానులు ఆందోళనలో పడ్డారు. జిల్లాలో పవన్ కళ్యాణ్ కు వేల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా పవన్ యాత్రలో పాలుపంచుకోవాలన్న ఆరాటంతో ఉన్నారు. అయితే వారికి పక్కా సమాచారం లేకపోవడంతో యాత్రలో పాల్గొంటామా లేదా అన్న ఆందోళనలో ఉన్నారు.

పవన్‌ ఆదివారం నుంచి ఉత్తరాంధ్రలో బస్సుయాత్ర ప్రారంభించారు. ముందుగా కవిటి మండలం, కాపాసుకుద్దిలో గంగ పూజ నిర్వహించారు. దీంతో అక్కడ మత్స్యకార మహిళలు పవన్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర సాగుతుంది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో పవన్ పర్యటించేలా జనసేన రూట్ మ్యాప్ సిద్ధి చేసింది. ఈ బస్సు యాత్రలో ప్రధానంగా స్థానిక ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

కానీ షెడ్యూల్ ప్రకారం కాకుండా యాత్ర సాగడం అభిమానుల్లో గందరగోళం నింపిందన్న ప్రచారం ఉంది. మరి దీనిపై జనసేనాని క్లారిటీ ఎప్పుడిస్తారో మరి ?

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే