పోరాటం క్లైమ్యాక్స్ కు చేరుకుంటోందా?

First Published Aug 18, 2017, 6:25 AM IST
Highlights
  • మంత్రి ఆదినారాయణరెడ్డి-ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మొదలైన ఆధిపత్య పోరాటం చివరకు పార్టీ పుట్టిముంచటం ఖాయంగా తోస్తోంది.
  • వీరిద్దరి మధ్య సయోధ్యకు చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నిచినా సాధ్యం కాలేదు.
  • వచ్చే ఎన్నికల్లోగా ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరే పార్టీలో ఉండే పరిస్ధతి స్పష్టంగా కనిపిస్తోంది.
  • ప్రత్యేకంగా ఆది నారాయణరెడ్డిని వైసీపీలో నుండి చంద్రబాబు లాక్కువచ్చారు కాబట్టి వదులుకోవటం అంత ఈజీ కాదు.

కడప జిల్లా జమ్మలమడుగులోని టిడిపి నేతల ఆధిపత్య పోరాటం క్లైమ్యాక్స్ కు చేరుకుంటోంది. మంత్రి ఆదినారాయణరెడ్డి-ఎంఎల్సీ రామసుబ్బారెడ్డి మధ్య మొదలైన ఆధిపత్య పోరాటం చివరకు పార్టీ పుట్టిముంచటం ఖాయంగా తోస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్యకు చంద్రబాబునాయుడు ఎంత ప్రయత్నిచినా సాధ్యం కాలేదు. వచ్చే ఎన్నికల్లోగా ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరే పార్టీలో ఉండే పరిస్ధతి స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఆ ఒక్కరూ ఎవ్వరంటే ప్రస్తుతానికైతే మంత్రి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ప్రత్యేకంగా ఆది నారాయణరెడ్డిని వైసీపీలో నుండి చంద్రబాబు లాక్కువచ్చారు కాబట్టి వదులుకోవటం అంత ఈజీ కాదు.

పై ఇద్దరి నేతల కుటుంబాల మధ్య వైరం దశాబ్దాల నాటిది. అందుకే ఇద్దరూ చెరోపార్టీలో ఉండేవారు. అటువంటిది చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే మంత్రిని వైసీపీ నుండి లాక్కువచ్చారు. తప్పని పరిస్ధితిలో రామసుబ్బారెడ్డికి చంద్రబాబు ఎంఎల్సీ ఇచ్చారు కానీ ప్రేమతో అయితే కాదు. ఎందుకంటే, ప్రేమ, అభిమానాలన్నవి చంద్రబాబు డిక్షనరీలోనే లేవు. ఉన్నదల్లా అవసరానికి వాడుకోవటం, పనికిరాడనుకుంటే వెంటనే వదిలించుకోవటం.

టిడిపిలో రామసుబ్బారెడ్డి పరిస్దితి ఇపుడు  అదేవిధంగా ఉంది. జమ్మలమడుగు ఏపి వైద్య విదాన పరిషత్ పాలక మండలి ఛైర్మన్ పోస్టు ఇద్దరి నేతల మధ్య తాజాగా చిచ్చు పెట్టింది. ఛైర్మన్ పోస్టు తన కొడుకు సుధీర్ రెడ్డికి ఇప్పించుకోవాలని మంత్రి చేసిన ప్రయత్నాలను ఎంఎల్సీ అడ్డుకున్నారు. దాంతో మంత్రి కొంత ఇబ్బంది పడ్డా మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించారు. ఛైర్మన్ గా తన కొడుకే బాధ్యతలు స్వీకరిస్తారని మంత్రి బహిరంగంగా ప్రకటించి రెండు వర్గాల మధ్య కాక రేపారు.

ఇదొకటే కాదు అనేక విషయాల్లో ఇద్దరి మధ్య ఏమాత్రం పొసగటం లేదన్నది వాస్తవం. రెండు వర్గాలూ గతంలో ఒకరిపై మరొకరు దాడులు కూడా చేసుకున్నాయి. పైగా వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ టిక్కెట్ తనకే దక్కాలంటూ ఇద్దరూ ఇప్పటి నుండే ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే రామసుబ్బారెడ్డి సోదరి హైమవతి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జమ్మలమడుగులో పోటీ చేసే అవకాశం తన సోదరునికి ఇవ్వకపోతే పార్టీలో కొనసాగే విషయమై ఆలోచించుకోవాల్సి వస్తుందని ఏకంగా చంద్రబాబునాయుడుకే హెచ్చరికలు పంపటంపై తీవ్రంగ చర్చ జరుగుతోంది. చూడబోతే తొందరలో రామసుబ్బారెడ్డి టిడిపిని వీడటం ఖాయమనే అనిపిస్తోంది.

 

 

 

click me!