గుంటూరులో బ్లాక్ ఫంగస్ కలకలం: సుల్తానాబాద్‌ మహిళకు లక్షణాలు

By narsimha lodeFirst Published May 17, 2021, 6:00 PM IST
Highlights

గుంటూరు జిల్లాలోని తెనాలిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. సుల్తానాబాద్‌కు చెందిన మహిళకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయపడ్డాయి. బ్లాక్ ఫంగస్ సోకడంతో కౌతవరపు మల్లేశ్వరి అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. 

గుంటూరు: గుంటూరు జిల్లాలోని తెనాలిలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. సుల్తానాబాద్‌కు చెందిన మహిళకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయపడ్డాయి. బ్లాక్ ఫంగస్ సోకడంతో కౌతవరపు మల్లేశ్వరి అనే మహిళ తీవ్ర అనారోగ్యానికి గురైంది. మల్లేశ్వరి భర్త భద్రయ్య ఇటీవల కరోనా బారిన పడి చికిత్స పొంది కోలుకున్నారు.

అయితే రెండు రోజులుగా  మల్లేశ్వరీ కూడ కరోనా లక్షణాలతో బాధపడ్డారు. దీంతో భార్యాభర్తలిద్దరూ  తెనాలి, గుంటూరు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.  మల్లీశ్వరీ బ్లాక్ ఫంగస్ కు గురైనట్టుగా వైద్యులు గుర్తించారు. అయితే ఇక్కడ సరైన సౌకర్యాలు, మందులు లేవని వైజాగ్ తీసుకెళ్ళమని వైద్యులు సూచిస్తున్నారు. రెండు కళ్ళకు ఫంగస్ చేరి బాధితురాలు మల్లేశ్వరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. 

కరోనాకు గురైన వారిలో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్య నిపుణులు చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 500 మందికి పైగా బ్లాక్ఫంగస్ బారినపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కూడ ఈ ఫంగస్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఫంగస్ బారిన పడినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

click me!