పశ్చిమగోదావరిలో 16 మంది మృతి: ఏపీలో కరోనా విజృంభణ, మృత్యుఘంటికలు

By narsimha lode  |  First Published May 17, 2021, 5:16 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 18,561కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 14 లక్షల 54 వేల 052కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 109 మంది మరణించారు. 
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 18,561కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 14 లక్షల 54 వేల 052కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 109 మంది మరణించారు. గత 24 గంటల్లో అనంతపురంలో 2094, చిత్తూరులో 1621, తూర్పుగోదావరిలో3152, గుంటూరులో1639, కడపలో815, కృష్ణాలో396, కర్నూల్ లో915, నెల్లూరులో 1282, ప్రకాశంలో 1115,విశాఖపట్టణంలో 2098, శ్రీకాకుళంలో 1287, విజయనగరంలో 962, పశ్చిమగోదావరిలో 1185 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో109  మంది మరణించారు. అనంతపురం,చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో 10 మంది చొప్పున కరోనాతో చనిపోయారు. విశాఖపట్టణంలో 9 మంది, నెల్లూరు, విజయనగరంలలో 8 మంది చొప్పున చనిపోయారు. శ్రీకాకుళం, కర్నూల్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. ప్రకాశంలో నలుగురు, కడపలో ముగ్గురు చనిపోయారు. పశ్చిమగోదావరిలో 16 మంది మరణించారు.  ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 9,481మంది చనిపోయారు. 

Latest Videos

undefined

గత 24 గంటల్లో కరోనా నుండి 17,334  మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 1,233,017 నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు1,80.49.054 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికి రాష్ట్రంలో 14,54,052 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,11,554 యాక్టివ్ కేసులున్నాయి. 

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-11,6311, మరణాలు 793
చిత్తూరు-1,58,558, మరణాలు1104
తూర్పుగోదావరి-1,86,214, మరణాలు 847
గుంటూరు -1,34,902, మరణాలు 848
కడప -83,793, మరణాలు 522
కృష్ణా -76,665 మరణాలు 872
కర్నూల్ -1,01202, మరణాలు 639
నెల్లూరు -1,04,873, మరణాలు 718
ప్రకాశం -92,731 మరణాలు 711
విశాఖపట్టణం -1,14,433, మరణాలు 808
విజయనగరం -65,093, మరణాలు 441
పశ్చిమగోదావరి-1,21,431, మరణాలు 695

click me!