జగన్ వెంట్రుక కూడా పీకలేరు.. వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Published : Aug 06, 2020, 07:47 AM IST
జగన్ వెంట్రుక కూడా పీకలేరు.. వైసీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

సారాంశం

మూడు రాజధానుల బిల్లు అంశం హైకోర్టులో విచారణలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి.

వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ స్థానిక రైతులంతా గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. వారు చేస్తున్న ఆందోళనను పండుల రవీంద్రబాబు అవహేళన చేశారు. అక్కడితో ఆగకుండా.. న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు, జడ్జీలు, కేసులు, సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని పండుల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పండులకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. అప్పటి నుంచి సందర్భం దొరికినప్పుడల్లా జగన్‌పై పండుల వీరవిధేయతను చాటుకుంటున్నారు. అయితే.. జగన్ మీద ఉన్న అభిమానంతో మరీ ఇంత దారుణమైన కామెంట్స్ చేస్తారా అని అందరూ విమర్శిస్తున్నారు.

మూడు రాజధానుల బిల్లు అంశం హైకోర్టులో విచారణలో ఉన్న ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధికార పార్టీ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేశాయి. పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రాజధాని కోసం రైతులు దీక్ష చేస్తుంటే.. వారిని కించపరిచేలా కామెంట్స్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar