వేసవికి విరామం... ఏపీలో చల్లబడ్డ వాతావరణం, మూడు రోజులవరకు ఇంతే...

By SumaBala BukkaFirst Published May 21, 2022, 10:41 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఉక్కకు కాస్త విరామం లభించింది. రుతుపవనాల ముందస్తు రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉష్ణోగ్రతల్లో ఈ మార్పుతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం అమరావతి వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురంలో 27.1 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 12 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయినట్లుగా నమోదైంది, ఆ తర్వాత కర్నూలులో 28.3 డిగ్రీలనుంచి 11.9 డిగ్రీలకు పడిపోగా, కడపలో 11.1 డిగ్రీలుగా నమోదయ్యింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 29.2 డిగ్రీలుగా నమోదైంది.

కావలి, నెల్లూరుల్లో వరుసగా 7.3, 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రెండు పట్టణాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 34.9,  34.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తెలంగాణ నుంచి రాయలసీమ, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలకు ఎగువ వాయు ప్రసరణం వల్ల రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కరుణసాగర్ తెలిపారు. రాయలసీమ, మధ్య కోస్తాలోని ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.

రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం కారణంగా బంగాళాఖాతం నుండి తేమ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల నుండి వేడి గాలులు నిరోధించబడ్డాయని ఆయన చెప్పారు. అయితే మూడు రోజుల తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపారు.ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవుల దక్షిణ భాగాలు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగాయి. మే 27 నాటికి కేరళ, జూన్ 2 నాటికి ఏపీలో రుతుపవనాలు ప్రవేశించవచ్చని ఆయన చెప్పారు.
 

click me!