అర్ధరాత్రి టీడీపీ నేత ఆలూరి హరికృష్ణ అరెస్ట్.. పోలీస్ స్టేషన్ వద్దే మాజీ మంత్రి దేవినేని ఉమ..

By Sumanth KanukulaFirst Published May 21, 2022, 10:04 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి(చిన్నా)ను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడిలో హరికృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి(చిన్నా)ను గత అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. గొల్లపూడిలో హరికృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే హరికృష్ణను ఏ కేసు నమోదు చేశారో చెప్పకుండా పోలీసులు అరెస్ట్ చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. హరికృష్ణ అరెస్ట్ విషయం తెలుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రాత్రి నుంచి దేవినేని ఉమ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. 

ఇక, వైసీపీ నేత కోమటి రామ్మోహన్ ఫిర్యాదు మేరకు హరికృష్ణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హరికృష్ణపై 307, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఇక, కాసేపట్లో హరికృష్ణను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు హరికృష్ణను పోలీసులు.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వేలిముద్రలు సేకరణ కోసం సూర్యారావుపేటలోని  సీసీఎస్‌కు తరలించారు. దీంతో దేవినేని ఉమ కూడా సీసీఎస్‌ వద్దకు చేరుకున్నారు. 

ఇక, దేవినేని ఉమ అనుచరుడు కాబట్టే హరికృష్ణపై కేసు బనాయించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నారనే కారణంతోనే అక్రమంగా కేసు పెట్టారని విమర్శిస్తున్నారు. 

click me!