తాగి అడ్డంగా బుక్కైన నారా లోకేష్...కాల్ లీక్ అంటూ వీడియోలు: పోలీసులకు ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Mar 18, 2021, 4:00 PM IST
Highlights

టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై యూట్యూబ్ లో ఫేక్ వీడియోలు అప్ లోడ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ తెలుగు యువత నాయకులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. 

మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతాయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ పేరుతో కొందరు యూట్యూబ్ లో ఫేక్ వీడియో అప్ లోడ్ చేస్తున్నారంటూ తెలుగు యువత నాయకులు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ చిన్నబాబుతో పాటు రాష్ట్ర నాయకుడు బండారు వంశీకృష్ణ, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మానం ప్రణవ్ గోపాల్ లు ఈ ఫిర్యాదు చేశారు. 

 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ లోకేష్ ఇమేజ్ ను దెబ్బతీయడానికి ఫేక్ వీడియోను అప్ లోడ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. #వై.ఎస్ జగన్ #న్యూస్ టుడే తెలుగు #వై.ఎస్.ఆర్.సి.పి అనే యాష్ ట్యాగ్ లతో వీడియో అప్ లోడ్ చేస్తున్నారని తెలిపారు. మరోసారి తాగి అడ్డంగా బుక్కైన నారా లోకేష్ కాల్ లీక్ అని వీడియో టైటిల్ పెట్టిన ఫేకిస్టులు ప్రచారం చేస్తున్నారని... ఇలా వీడియో అప్ లోడ్ చేసిన ఫేకిస్టులపై చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ  కోరారు.

గతంలో కూడా లోకేష్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. విదేశాల్లో చదువుతున్న సమయంలో లోకేష్ అమ్మాయిలతో జల్సాలు చేసేవాడంటూ... అప్పటివే ఈ ఫోటోలు అంటూ ప్రచారం జరిగింది. అయితే తెలుగుదేశం నాయకులు మాత్రం లోకేష్ పై దుష్ఫ్రచారం చేయడానికే ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అలాంటి తప్పుడు ప్రచారాన్నే మళ్లీ లోకేష్ పై ప్రారంభించారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

click me!