ఏపీ సర్కార్ ఎస్ఈసీ మధ్య ముదురుతున్న వార్: నిమ్మగడ్డకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు

Published : Mar 18, 2021, 03:54 PM ISTUpdated : Mar 18, 2021, 04:09 PM IST
ఏపీ సర్కార్ ఎస్ఈసీ మధ్య ముదురుతున్న వార్: నిమ్మగడ్డకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కే ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరనీ నోటీసులు పంపారు.ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో  అసెంబ్లీ కార్యదర్శినోటీసులు పంపారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కే ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరనీ నోటీసులు పంపారు.ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో  అసెంబ్లీ కార్యదర్శినోటీసులు పంపారు.

గ్రామపంచాయితీ ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణాలు తమను అవమానించేలా ఏపీ ఎస్ఈసీ వ్వవహరించారని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుపై ఏపీ  అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ బుధవారం నాడు సాయంత్రం సమావేశమైంది.

గతంలో కూడ ప్రివిలేజ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. నిన్న జరిగిన సమావేశంలో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ నిర్ణయాన్ని అసెంబ్లీ సెక్రటరీ ప్రివిలేజ్ కమిటీ  తెలిపింది. ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో అసెంబ్లీ సెక్రటరీ గురువారంనాడు మధ్యాహ్నం ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీసులు పంపారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదుపై నోటీసులు జారీ చేసినట్టుగా నోటీసుల్లో పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా తనను హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై పెద్దిరెడ్డి ఫిర్యాదు చేశారు. 

also read:నేడు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇక చుక్కలే

విచారణకు అందుబాటులో ఉండాలని కూడ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులపై  నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి.రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకొంటుంది. అయితే సెలవుపై వెళ్లాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావిస్తున్నారు.  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గవర్నర్ ను కోరారు.

ఈ నెలాఖరుకు  ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు సెలవుపై వెళ్లాలని ఆయన భావించారు.అయితే మేయర్లు, చైర్మెన్ల ఎన్నిక సమయంలో తన అవసరం ఉంటుందని భావించిన సమయంలో తన సెలవును కుదించుకొన్నారు. ఈ నెల 19 నుండి 22 వరకు సెలవుపై వెళ్లాలని  ఆయన నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ తరుణంలో ఈ నోటీసుల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లేందుకు ఇబ్బందులు ఏదురయ్యే అవకాశాలు లేకపోలేదు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!