ఏపీలో ఇదీ పరిస్థితి... నువ్వే కాపాడాలి స్వామి: వినాయకుడికి తెలుగుయువత అధ్యక్షుడి వినతిపత్రం

Arun Kumar P   | Asianet News
Published : Sep 10, 2021, 11:40 AM ISTUpdated : Sep 10, 2021, 11:46 AM IST
ఏపీలో ఇదీ పరిస్థితి... నువ్వే కాపాడాలి స్వామి: వినాయకుడికి తెలుగుయువత అధ్యక్షుడి వినతిపత్రం

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడాలంటూ వినాయకుడికి తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు వినతిపత్రం సమర్పించారు.

అమరావతి: వినాయక చవితి పర్వదినాన ఈ స్వామికి పూజాదికాలు నిర్వహించిన తెలుగు యువత అధ్యక్షుడు రవి నాయుడు ఏపీలో నెలకొన్న పరిస్థితును వివరిస్తూ ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... ఈ కష్టాల నుండి ప్రజలని కాపాడాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు మంచి బుద్దిని ప్రసాదించాలంటూ గణనాదుడికి విన్నవించుకున్నారు రవి నాయుడు.

 విఘ్నేశ్వరుడికి రవి నాయుడు సమర్పించిన వినతిపత్రం యధావిధిగా: 

స్వామి విజ్ఞేశ్వరా... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  కరోనా మహమ్మారి భయం కంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చూస్తే రాష్ట్ర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు..! రాష్ట్రంలో ఎక్కడ చూసినా అశాంతి, అభద్రతకు లోనవుతున్నారు. స్వామి... రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. బడికి వెళ్లినా, గుడికి వెళ్లినా ఆకరికి శుభకార్యాలకు వెళ్లినా క్షేమంగా తిరిగి వస్తాము అనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అరాచకాలు, అక్రుత్యాలు, మాఫియాలతో, దోపిడీలో విరాజిల్లుతోంది. రాష్ట్రంలో ప్రశ్నిస్తే అరెస్టులు, ఎదురు నిలబడితే కేసులు... ఇదీ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. ఆంధ్ర  ప్రదేశ్ అన్నపూర్ణగా ప్రసిద్ది... ఇప్పుడు అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా ప్రసిద్ది చెందుతా వుంది. 

read more  వైసిపి పాలకుల వక్రబుద్దిని చక్కదిద్దు వక్రతుండా...: వినాయకున్ని కోరుకున్న లోకేష్

ఆంధ్ర ప్రదేశ్ లో చంటిబిడ్డ నుండి కాటికి పోయే ముసలి వాళ్ల వరకు ఇబ్బంది పడుతూనే వున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి.పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటి డబుల్ సెంచరీ వైపు దూసుకెలుతున్నాయి. గ్యాస్ ధరలు పెరిగి ఆకరికి మీకు మంచి నైవేధ్యం పెట్టే పరిస్థితి కూడా ఆంధ్ర ప్రదేశ్ లె లేకుండా పోయింది స్వామి. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కరువయ్యింది... ఇండియన్ ఫీనల్ కోడ్ అమలు కావడం లేదు.ఇసుక, సిమెంట్ ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదవారు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. కరెంట్ బిల్లులు చూస్తే గుండెపోటు వస్తోంది. పనికి పోదాం అంటే పని లేదు. చదువుకున్న వారికీ ఉద్యోగం లేదు, చదువేమో సాగే పరిస్థితి లేదు, యువత పరిస్థితి అగమ్యగోచరం, మాటల తప్పను మడమ తిప్పను అని చెప్పి ఇప్పుడేమో మాటలే లేవు అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. 

స్వామి విజ్ఞేశ్వరా... ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసినా అరాచకాలే. స్వామి ఈ ముఖ్యమంత్రి జగన్ కు మంచి బుద్దిని ప్రసాదించేలా చూడండి స్వామి. ఆంధ్ర ప్రదేశ్  ప్రజలను కాపాడండి స్వామి...మీకు కోటి దండాలతో విన్నపం. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్