ట్రాఫిక్, శాంతిభద్రతలకు విఘాతం: నారా లోకేష్, వంగలపూడి అనితపై కేసులు

By narsimha lode  |  First Published Sep 10, 2021, 11:32 AM IST


కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ తెలుగు మహిళా విభాగం చీఫ్ వంగలపూడి అనితలపై కేసులు నమోదయ్యాయి. నర్సరావుపేటలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్  నర్సరావుపేటకు వెళ్లకుండా గురువారం నాడు పోలీసులు అడ్డుకొన్నారు. 



విజయవాడ:  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా, టీడీపీ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితలపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రేమోన్మాది చేతిలో హత్య కు గురైన అనూష కుటుంబానికి పరామర్శించేందుకు లోకేష్  నర్సరావుపేటకు గురువారం నాడు వెళ్లాల్సి ఉంది. అయితే లోకేష్ ను గన్నవరం  ఎయిర్ పోర్టు వద్దే నిలిపివేశారు. 

నర్సరావుపేటకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్టు నుండి నేరుగా ఆయనను అమరావతిలోని ఇంటికి తరలించారు. అయితే లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. పోలీసులతో వాగ్వావాదానికి దగారు. పోలీసుల కాన్వాయ్ కు అడ్డుపడ్డారు. 

Latest Videos

undefined

also read:అనూష హత్య జరిగి 7 నెలలైంది.. ఇప్పుడు పరామర్శిస్తారా: లోకేశ్‌పై సుచరిత ఆగహం

ఈ ఘటనపై పోలీసులు  కేసులు నమోదు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.ఐపీసీ 34, 186,289 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ట్రాఫిక్ కు అంతరాయం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని కేసులు కృష్ణలంక పోలీసులు కేసులు పెట్టారు.

click me!