భార్యపై కృష్ణా జిల్లా టిడిపి యూత్ లీడర్ దాష్టికం

First Published Jun 25, 2018, 4:00 PM IST
Highlights

భార్య తెలప్రోలు సర్పంచ్...

కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ తనకు భర్త నుండి ప్రాణహాని ఉందంటూ ఏకంగా పేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడంలేదని, అందువల్లే అందరికీ తన భాద తెలియాలని ఇలా పేస్ బుక్ లో పోస్ట్ పెట్టినట్లు తెలిపింది. తన భర్త అధికార పార్టీలో జిల్లా స్థాయి నేతగా కీలక పదవిలో ఉ:డటంతో అతడిపై చర్యలు తీసుకోడానికి భయపడుతున్నారంటూ ఆవేధన వ్యక్తం చేసింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని తెలప్రోలు గ్రామంంలో అధికార పార్టీకి చెందిని హరిణి కుమారి సర్పంచ్ గా పనిచేస్తోంది. ఆమె భర్త భీమవరపు యతేంద్ర రామకృష్ణ కృష్ణా జిల్లా టిడిపి యూత్ లీడర్ గా ఉన్నాడు. అయితే అతడి నుండి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని హరిణి కుమారి ఆరోపిస్తున్నారు. 

ఆమె పేస్ బుక్ లో పెట్టిన పోస్టులో ఈ విధంగా ఉన్నాయి. తన భర్త యతేంద్ర గత కొంత కాలంగా శారీరకంగానే కాకుండా మానసికంగా బాధ పెడుతున్నాడని హరిణి తెలిపారు. ఈ విషయంపై సంవత్సరం క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయితే అతడు తన పలుకుబడిని ఉపయోగించి పోలీసుల మీద ఒత్తడి తెచ్చి తనచేతే ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేశాడని తెలిపింది. 

ఆ తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదని హరిణి తెలిపారు. పురుషాహంకారంతో తన పదవీ బాద్యతల్లో కూడా తలదూర్చేవాడని తెలిపింది. దీంతో విసుగు చెందానని, తనకు ఎక్కడా న్యాయం జరగదని బావించి ఇలా ఫేస్ బుక్ ద్వారా తన బాధ అందరికి తెలియజేస్తున్నానని తెలిపారు. దీని తర్వాత ఎలాగూ భర్త ప్రాణాలతో బ్రతకనివ్వడు కాబట్టి కనీసం తన పిల్లలనైనా నాపాడండంటూ హరిణి వేడుకుంది. తన పరిస్థితి మరో ఆడపడుచుకు రాకుండా ఉండాలనే ఇలా ప్రాణాలకు తెగించానని అన్నారు.

అయితే ఈ పోస్ట్ అనంతరం పరిస్థితులు మారిపోయాయి. ఫేస్ బుక్ లో ఈ పోస్ట్ చక్కర్లు కొడుతుండటంతో పోలీసులు కూడా స్పందించారు. వారే స్వయంగా సర్పంచ్ హరిణి కుమారి వద్ద కు వెళ్లి ఫిర్యాదు స్వీకరించినట్లు సమాచారం. ఆమె భర్తపై కేసు కూడా నమోదు చేశారు.  

 

 

click me!