తెలంగాణ హైకోర్టులో ఏపీ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి చుక్కెదురు

By telugu teamFirst Published Jul 3, 2021, 7:15 AM IST
Highlights

ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో ఏపీ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారి వై. శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసు నిందితురాలు శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం గనుల సరిహద్దుల వివాదంపై దర్యాప్తు పూర్తయ్యే వరకు సీబిఐ కోర్టులో విచారణ ఆపేయాలని కోరుతూ శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. 

ఆ పిటిషన్ మీద జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారంనాడు విచారణ జరిపారు. పిటినర్ ఇప్పటికే మూడు పిటిషన్లు దాఖలు చేశారని సిబిఐ తరఫున న్యాయవాది అన్నారు. ఏదో కారణంతో విచారణ ముందుకు సాగకుండా చూస్తున్నారని తప్పుపట్టారు ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ఇదే విష,యాన్ని రాతపూర్వకంగా సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసిన విషయానని ఇక్కడ చెప్పాలని ఆదేశించారు. శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ... సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతోందని, , ఇటవీల కేసు విచారణకు రాగా వాయిదా కోరినందుకు ఖర్చుల కింద రూ.1000 చెల్లించాలని ఆదేశించిందని గుర్తు చేశారు. 

అందువల్ల కనీసం పిటిషనర్ వరకు అయినా విచారణను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని శ్రీలక్ష్మి తరపున న్యాయవాది కోరారు. అందుకు న్యాయమూర్తి నిరాకిరంచారు. కింద కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేస్తుదని చెప్పి విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు. 

click me!