దుర్గగుడి అక్రమాల్లో ట్విస్ట్: సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది తిరిగి విధుల్లోకి.. పావులు కదుపుతున్న ఈవో

Siva Kodati |  
Published : Jul 02, 2021, 07:27 PM ISTUpdated : Jul 02, 2021, 07:28 PM IST
దుర్గగుడి అక్రమాల్లో ట్విస్ట్: సస్పెన్షన్‌కు గురైన సిబ్బంది తిరిగి విధుల్లోకి.. పావులు కదుపుతున్న ఈవో

సారాంశం

విజయవాడ దుర్గగుడి అక్రమాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయంలోని పలు విభాగాల్లో అవకతవకలకు పాల్పడిన 15 మందిపై 2 నెలల క్రితం సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. నాడు ఏసీబీ నివేదిక ఆధారంగా 15 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు

విజయవాడ దుర్గగుడి అక్రమాల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయంలోని పలు విభాగాల్లో అవకతవకలకు పాల్పడిన 15 మందిపై 2 నెలల క్రితం సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. నాడు ఏసీబీ నివేదిక ఆధారంగా 15 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన 15 మందిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దేవాదాయ శాఖ కమీషనర్‌తో ఈవో, అధికారులు సమావేశమైనట్లుగా సమాచారం. సస్పెన్షన్‌లో వున్నవారిని తిరిగి తీసుకునే ప్రయత్నాలపై విమర్శలు వస్తున్నాయి. 

కాగా, దుర్గగుడి టెండర్లలో విస్తుపోయే విషయాలను గుర్తించారు విజిలెన్స్ అధికారులు . సెక్యూరిటీ టెండర్లలాగానే, శానిటరీ టెంటర్లను నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేసినట్లుగా చెప్పారు. మూడు కంపెనీలు టెంటర్లు వేసినా, నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నికల్ సర్వీసెస్‌కు టెండర్లు ఇచ్చారని చెబుతున్నారు విజిలెన్స్ అధికారులు. కమీషనర్ అనుమతి లేకుండా ఈవో సురేశ్ బాబు అగ్రిమెంట్ చేసినట్లుగా గుర్తించారు.

Also Read:దుర్గగుడిలో అక్రమాలు: అంతా తానై నడిపిన ఈవో.. విజిలెన్స్ దర్యాప్తులో వాస్తవాలు

2019లోనే టెండర్ రద్దు చేయాలని అప్పటి కమీషనర్ పద్మ ఆదేశించారు. మార్చి 31తో గడువు ముగిసినా కొత్త టెండర్లు ఫైనల్ చేయకుండా జాప్యం చేసినట్లుగా తేలింది. కొత్తగా శానిటరీ కోసం ఆరుగురు టెండర్లు వేసినా ఫైనల్ చేయలేదు అధికారులు. దర్యాప్తులో భాగంగా శానిటరీ టెండర్ల విషయంలో ఈవో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు విజిలెన్స్ అధికారులు. ఇటీవల ఫిబ్రవరి నెలలో దుర్గగుడికి సంబంధించిన జమ్మిదొడ్డి లోని ఆలయ పరిపాలన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి దుర్గగుడి పరిపాలనలో అనేక కీలక విభాగాలలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu