అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట: అరెస్ట్ చేయవద్దని ఆదేశం

By narsimha lode  |  First Published Mar 13, 2023, 2:29 PM IST

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేయవద్దని  తెలంగాణ హైకోర్టు  ఆదేశించింది. 


హైదరాబాద్: కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డికి  తెలంగాణ హైకోర్టులో  ఊరట లభించింది.   తదుపరి తీర్పు వచ్చేవరకు  అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేయవద్దని  తెలంగాణ హైకోర్టు  ఆదేశించింది.  

కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు  చేసిన పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టులో  సోమవారం నాడు విచారణ జరిగింది.  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసు  విషయంలో  తీవ్ర చర్యలు తీసకోవద్దన్న అవినాష్ రెడ్డి  పిటిషన్ పై  తీర్పును  హైకోర్టు ధర్మాసనం రిజర్వ్  చేసింది. అంతేకాదు  తదుపరి విచారణపై  స్టే ఇవ్వాలన్న పిటిషన్ పై  కూడా తీర్పును హైకోర్టు రిజర్వ్  చేసింది.  తదుపరి  తీర్పును వెల్లడించే వరకు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేయవద్దని  హైకోర్టు  సోమవారం నాడు ఆదేశించింది. 

Latest Videos

undefined

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  సంబంధించి విచారణ  నివేదికకు సంబంధించిన  అంశాలను   సీల్డ్ కవర్లో  హైకోర్టుకు సమర్పించింది  సీబీఐ.10 డాక్యుమెంట్లు , 35 సాక్షుల వాంగ్మూలాలు,  కొన్ని ఫోటోలను హైకోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు.  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించే  సమయంలో  ఆడియో,. వీడియోలను రికార్డు  చేస్టున్నట్టుగా సీబీఐ అధికారులు హైకోర్టుకు తెలిపారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసు విచారణ  పారదర్శకంగా  సాగడం లేదని  తెలంగాణ హైకోర్టులో  కడప ఎంపీ వైఎస్ అవినాస్ రెడ్డి ఈ నెల  9వ తేదీన పిటిషన్ ను   దాఖలు  చేశారు.ఈ పిటిషన్ పై  ఈ నెల  10వ తేదీన  హైకోర్టు విచారణ నిర్వహించింది.  ఈ కేసుకు సంబంధించిన  ఫైళ్లను  , డాక్యుమెంట్లను  ఈ నెల  13వ తేదీలోపుగా  హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.  

ఈ నెల  13 వరకు  అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేయవద్దని  కూడా ఆదేశాలు జారీ చేసింది.  ఇవాళ్టికి విచారణను వాయిదా వేసింది.  ఇవాళ  ఉదయం నుండి  విచారణ జరిగింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసుకు సంబంధించిన  సాక్ష్యాల ధ్వంసంలో   అవినాష్ రెడ్డి పాత్ర ఉందని  సీబీఐ తరపు న్యాయవాది  హైకోర్టులో  వాదించారు.  రెండు  రోజుల క్రితం  సీబీఐ కార్యాలయం వద్ద  అవినాష్ రెడ్డి మీడియా సమావేశంపై  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం  చేసింది.  ఈ కేసు దర్యాప్తు  జరుగుతున్న సమయంలో  సీబీఐ కార్యాలయం వద్ద మీడియా సమావేశం  ఏర్పాటు  చేయడంపై  హైకోర్టు  మండిపడింది.

also read:అన్నింటికి సిద్దంగానే ఉన్నా: వివేకా హత్యపై వైఎస్ భాస్కర్ రెడ్డి

రేపు విచారణకు  రావాలని సీబీఐ  ఇచ్చిన నోటీసులపై  స్టే  ఇవ్వాలని అవినాష్ రెడ్డి  న్యాయవాది కోరారు.   పార్లమెంట్  సమావేశాలు  ఉన్నందున  విచారణకు  హాజరయ్యేందుకు  ఇబ్బంది ఉంటుందని హైకోర్టుకు తెలిపారు. అయితే  ఈ విషయాన్ని సీబీఐకి తెలిపి  మినహాయింపు కోరాలని  హైకోర్టు అవినాష్ రెడ్డి న్యాయవాదికి సూచించింది.


 

click me!