వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా: సీబీఐకి హైకోర్టు సూచనలు

By narsimha lode  |  First Published Apr 17, 2023, 4:41 PM IST

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ  ఈ నెల  18వ తేదీకి  వాయిదా  వేసింది, 


హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు  బెయిల్ పిటిషన్ పై విచారణను  రేపటికి వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు. మరో వైపు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రేపు  సాయంత్రం  నాలుగు  గంటల తర్వాతే విచారణకు  పిలవాలని సీబీఐకి సూచించింది  తెలంగాణ హైకోర్టు .

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో  ఇవాళ  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై  ఇవాళ  మధ్యాహ్నం విచారణ  జరిగింది.     ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ  సాగుతున్న తరుణంలోనే  సీబీఐ విచారణ  ను వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు  కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే  ఇవాళ సాయంత్రం ఐదు గంటల తర్వాత  విచారణ  చేస్తామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.  హౌకోర్టులో  వైఎస్ అవినాష్ రెడ్డి  ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ  నేపథ్యంలో  ఇవాళ  విచారణను  రేపటికి వాయిదా వేసింది  సీబీఐ .

Latest Videos

undefined

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు  బెయిల్ పిటిషన్ పై  వైఎస్ సునీతారెడ్డి  కూడా ఇంప్లీడ్  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను  హైకోర్టు  అనుమతించింది.  ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ సమయంలో  సీబీఐ, వైఎస్ అవినాష్ రెడ్డి  లాయర్లు  మధ్య  కీలక వాదనలు  జరిగాయి.  వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్  చేస్తారా అని సీబీఐ న్యాయవాదిని   హైకోర్టు ప్రశ్నించింది.  అవసరమైతే  వైఎస్ అవినాష్ రెడ్డిని  అరెస్ట్  చేస్తామని  హైకోర్టుకు  సీబీఐ తరపు న్యాయవాది  చెప్పారు. ఈ మేరకు  సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

also read:అవసరమైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాం: ముందస్తు బెయిల్ పిటిషన్ పై కీలక వాదనలు

 ఇరువర్గాల వాదనలు  విన్న తర్వాత  ఈ పిటిషన్ పై విచారణను  రేపటికి  వాయిదా వేసింది  తెలంగాణ హైకోర్టు. అయితే  రేపు  వైఎస్ అవినాష్ రెడ్డిని  సీబీఐ  విచారణకు పిలిచిన విషయాన్ని  అవినాష్ రెడ్డి  తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  అయితే  రేపు సాయంత్రం  నాలుగు గంటల తర్వాతే  వైఎస్ అవినాష్ రెడ్డిని  విచారణకు  పిలవాలని సీబీఐకి  సూచించింది  తెలంగాణ హైకోర్టు.
 

click me!