ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త: హైదరాబాద్ నుంచి అమరావతికి బస్సులకు తెలంగాణ ఓకే..!!

Siva Kodati |  
Published : May 26, 2020, 09:08 PM ISTUpdated : May 26, 2020, 09:09 PM IST
ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త: హైదరాబాద్ నుంచి అమరావతికి బస్సులకు తెలంగాణ ఓకే..!!

సారాంశం

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. వీరంతా హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లేందుకు అనుమతి లభించింది

లాక్‌డౌన్ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. వీరంతా హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లేందుకు అనుమతి లభించింది. సచివాలయ ఉద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిపే బస్సులకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖ రాశారు.

Also Read:టీటీడీ ఆస్తులపై ఆడిట్ జరపాలి: రమణ దీక్షితులు మరో సంచలనం

హైదరాబాద్‌లో చిక్కుకుని విధులకు తమ ఉద్యోగులకు విధులకు రాలేకపోతున్నారని... ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆమె లేఖలో కోరారు. దీనిపై స్పందించిన సోమేశ్ కుమార్ బస్సులు నడిచేందుకు అంగీకరించారు.

తెలంగాణ ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో బుధవారం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 400 మంది ఉద్యోగులు అమరావతికి చేరుకోనున్నారు. హైదరాబాద్ నగరంలోని మియాపూర్, కేపీహెచ్‌బీ, లక్డీకపూల్, ఎల్బీనగర్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ 10 బస్సులను ఏర్పాటు చేసింది.

Also Read:జడ్జిలపై సోషల్ మీడియాలో పోస్టులు: ఎంపీ సురేష్ సహా 49 మందికి హైకోర్టు నోటీసులు

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసీ బస్సులు ప్రారంభించినా.. అంతర్‌రాష్ట్ర సర్వీసులను మాత్రం అనుమతించడం లేదు. 
 

PREV
click me!

Recommended Stories

నగరి స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో CM Chandrababu Power Full Speech | Asianet News Telugu
అమెరికాఅనుభవాలతో సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని ఆశిస్తున్నా: Chandrababu | Asianet News Telugu