వైసీపీ ఎమ్మెల్సీ బర్త్‌‌డే వేడుకల్లో యువతులతో కలిసి చిందులు.. టెక్కలి ఎస్‌ఐ‌పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు

Published : Nov 06, 2022, 01:56 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ బర్త్‌‌డే వేడుకల్లో యువతులతో కలిసి చిందులు.. టెక్కలి ఎస్‌ఐ‌పై చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు

సారాంశం

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్‌ఐ హరికృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ హరికృష్ణ యువతులతో కలిసి చిందులేశారు.


శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎస్‌ఐ హరికృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఎస్ఐ హరికృష్ణ యువతులతో కలిసి చిందులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు. హరికృష్ణను వీఆర్‌కు పంపించారు. హరికృష్ణను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా జిల్లా ఎస్సీ జీఆర్ రాధిక తెలిపారు.   

వివరాలు.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ బర్త్ డే సందర్భంగా శుక్రవారం రోటరీ నగర్ ప్రాంతంలో డ్యాన్స్ పోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో డ్యాన్స్ చేసేందుకు యువతులను కూడా రప్పించారు. ఈ వేడుకలకు టెక్కలి ఎస్ఐ హరికృష్ణ కూడా హాజరయ్యారు. స్టేజ్‌పైకి ఎక్కి యువతులతో కలిసి చిందులేశారు.  అబ్బనీ తీయని దెబ్బ సాంగ్‌కు యువతులతో కలిసి డ్యాన్స్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 

అశ్లీల నృత్యాలు ఆపాల్సిన పోలీసు అధికారి.. ఇలా యువతులతో కలిసి డ్యాన్స్‌లు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. ఎస్‌ఐ హరికృష్ణపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసు ఉన్నతాధికారులు హరికృష్ణను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు