చంద్రబాబు కాన్వాయ్‌ మీద ‌రాళ్ల దాడి.. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిదేమిటంటే..?

Published : Nov 06, 2022, 10:23 AM IST
చంద్రబాబు కాన్వాయ్‌ మీద ‌రాళ్ల దాడి.. పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిదేమిటంటే..?

సారాంశం

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై విచారణ చేపట్టేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. డీసీపీ విశాల్ గున్ని పర్యవేక్షణలో సిట్‌లు పనిచేస్తాయని పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఈ క్రమంలోనే దర్యాప్తు బృందాలు చేపట్టిన ప్రాథమిక విచారణ ప్రకారం.. సంఘటన జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఎత్తైన భవనాలపై నుండి రాళ్లను విసిరినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీసీ తన కథనంలో పేర్కొంది.

ఇక, పోలీసులు ఘటన స్థలంలో, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నారని.. అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారని కాంతి రాణా టాటా చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘‘ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. విజయవాడ నుంచి నందిగామ వరకు వివిధ పోలీసు బృందాలతో చంద్రబాబుకు ప్రొటోకాల్‌ ప్రకారం భద్రత కల్పించారు’’ అని రాణా తెలిపారు. ఈ కేసును త్వరలో ఛేదించడానికి పోలీసులు నాయుడు భద్రతా సిబ్బందితో టచ్‌లో ఉన్నారని టాటా చెప్పారు.

‘‘సీసీటీవీ ఫుటేజ్‌లను, ర్యాలీ సమయంలో తీసిన వీడియో ఫుటేజీలను పోలీసులు సేకరిస్తున్నారు. సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సంఘటన తర్వాత కార్యక్రమం కొనసాగింది. శాంతియుతంగా సాగింది’’డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. 

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగ్గయ్యపేటకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు నందిగామలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వారికి అభివాదం చేస్తున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు వాహనంపై రాళ్లతో దాడి చేశాడు. వాహనంపై రాళ్ల  దాడి  జరిగిన ఘటనలో చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. అయితే చంద్రాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకు రాయి తగలడంతో గాయమైంది. దీంతో వెంటనే మధుబాబుకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన తర్వాత ఎస్పీజీ భద్రతా సిబ్బంది చంద్రబాబు నాయుడుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర టీడీపీ నేతలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానితుల చిత్రాలను ఫిర్యాదుతో పాటు అందజేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశామని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్