ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి సీటు చాలా కీలకంగా మారింది. ఇక్కడి నుండి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పోటీలో వున్నారు. ఆయనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ... ఎలాగైనా మళ్లీ గెలింపించుకోవాలని టీడీపీ పట్టుదలతో వున్నాయి. ఇలా ఇరుపార్టీలు టెక్కలి అసెంబ్లీని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితం ఎలావుంటుందన్నది ఆసక్తి నెలకొంది.
టెక్కలి నియోజకవర్గ రాజకీయాలు :
పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు వైసిపి గెలుపన్నది ఎరుగని నియోజకవర్గాల్లో టెక్కలి ఒకటి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కింజరాపు అచ్చెన్నాయుడు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసారు. అయితే 2019లో వైసిపి గాలి బలంగా వీయడంతో టిడిపి పెద్దపెద్ద నాయకులు సైతం ఓటమిపాలయ్యారు... కానీ టెక్కలిలో అచ్చెన్న మరోసారి విజయం సాధించారు.
undefined
1983 అసెంబ్లీ ఎన్నికల నుండి టెక్కలిలో టిడిపి విజయపరంపర మొదలయ్యింది. మొదటిసారి అట్టాడ జనార్ధనరావు గెలిచారు. ఆ తర్వాత వరుసగా 1985 లో సరోజా వరద, 1989లో దువ్వాడ నాగావళి విజయం సాధించారు. ఇక 1994 ఎన్నికల్లో ఏకంగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఇక్కడినుండి పోటీచేసారు. కానీ ఆయన రాజీనామాతో 1995 లో ఉపఎన్నిక జరగ్గా అందులోనూ టిడిపి అభ్యర్థి అప్పయ్యదొర హన్మంతు గెలిచారు. 1999 కొర్ల రేవతి టిడిపి నుండి పోటీచేసి గెలిచారు.
టెక్కలి నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. నందిగాం
2. టెక్కలి
3. సంతబొమ్మాళి
4. కోటబొమ్మాళి
టెక్కలి అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,24,852
పురుషులు - 1,14,684
మహిళలు - 1,10,149
టెక్కలి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి అసెంబ్లీ బరిలో నిలిపింది వైసిపి. 2019 లో పోటీచేసే అవకాశం దక్కకున్నా 2019 లో ఛాన్స్ దక్కింది. అయితే ఈసారి సీటు ఖాయమని ముందునుండి పార్టీ అధిష్టానం హామీ ఇవ్వడంతో గ్రౌండ్ వర్క్ చేసుకుని ఎన్నికలకు సిద్దమయ్యారు.
టిడిపి అభ్యర్థి :
ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మళ్లీ టెక్కలి నుండి పోటీ చేస్తున్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఈసారి హ్యాట్రిక్ పై కన్నేసారు.
టెక్కలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
టెక్కలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై అచ్చెన్నాయుడు కింజరాపు విజయం సాధించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కింజరాపు 34435 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
టెక్కలి అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,73,648 (78 శాతం)
టిడిపి - కింజరాపు అచ్చెన్నాయుడు - 87,658 ఓట్లు (50 శాతం) - 8,545 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - పేరాడ తిలక్ - 79,113 ఓట్లు (45 శాతం) - ఓటమి
టెక్కలి అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,60,394 ఓట్లు (78 శాతం)
టిడిపి - కింజరాపు అచ్చెన్నాయుడు - 81,167 (45 శాతం) - 8,387 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - దువ్వాడ శ్రీనివాస్ - 72,780 (45 శాతం) - ఓటమి