ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకే ఈసారి టికెట్ దక్కలేదు. పొత్తులొ భాగంగా ఈ సీటు బిజెపికి దక్కింది. ఇక వైసిపి మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కు మరోసారి అవకాశం ఇచ్చింది.
ఎచ్చెర్ల నియోజకవర్గ రాజకీయాలు :
ఉత్తరాంధ్రలో టిడిపి మంచి పట్టున్న నియోజకవర్గాల్లో ఎచ్చెర్ల ఒకటి. ఎన్టీఆర్ టిడిపి పార్టీ పెట్టగానే ఆయనవెంట నడిచిన ప్రతిభా భారతి 1983 లో ఎచ్చెర్ల బరిలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా 1985, 1989, 1994, 1999 ఎన్నిక్లలో విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఆమె రాష్ట్ర శాసనసభకు తొలి మహిళా స్పీకర్ గా పనిచేసారు.
undefined
ప్రతిభా భారతి తర్వాత ఎచ్చెర్లలో కళా వెంకట్రావు టిడిపి తరపున పోటీచేసారు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన 2014 లో మాత్రం విజయం సాధించారు. కానీ మళ్లీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసిపి అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ఎచ్చెర్ల
2. లావేరు
3. రణస్థలం
4. గంగువారి సిగడాం
ఎచ్చెర్ల అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 24,7,941
పురుషులు - 1,22,888
మహిళలు - 1,25,033
ఎచ్చెర్ల అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ నే వైసిపి ఎచ్చెర్ల బరిలో దింపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన టిడిపి సీనియర్ నాయకుడు కళా వెంకట్రావును ఓడించారు.
బిజెపి అభ్యర్థి :
ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా నడుకుదిటి ఈశ్వరరావు ఎచ్చెర్లలో పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించాయి టిడిపి, జనసేన.
ఎచ్చెర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
ఎచ్చెర్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ గొర్లెపై ఈశ్వరరావు నడుకుదిటి 29089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఎచ్చెర్ల అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,90,744 (84 శాతం)
వైసిపి - గొర్లె కిరణ్ కుమార్ - 1,06,672 ఓట్లు (52 శాతం) - 18,711 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - కిమిడి కళా వెంకట్రావు - 80,961 ఓట్లు (42 శాతం) - ఓటమి
ఎచ్చెర్ల అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,74,001 ఓట్లు (82 శాతం)
టిడిపి - కిమిడి కళా వెంకట్రావు - 85,769 (49 శాతం) - 4,741 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - గొర్లె కిరణ్ కుమార్ - 81,028 (46 శాతం) - ఓటమి