
గుంటూరు: వివాహేతర సంబంధాలు (illict affair) జీవితాలను చిద్రం చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నా కొంతమందిలో మార్పు రావడం లేదు. క్షణకాలం శారీరక సుఖం కోసం విచ్చలవిడిగా వ్యవహరించడం ఎన్నో దారుణాలకు దారితీస్తోంది. తాజాగా పెళ్లయి ఇద్దరుపిల్లలు పుట్టాక ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చుకుంది. ఈ దారుణం గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ దుర్ఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా (guntur district) కంతెర గ్రామానికి చెందిన గులకవరపు నరేష్ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి. ఇతడికి నాదెడ్ల గ్రామానికి చెందిన విజయలక్ష్మితో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. హాయిగా సాగుతున్న వీరి జీవితంలో వివాహేతర సంబంధం కలకలం రేపింది.
విజయలక్ష్మికి సాలూరు గ్రామానికి చెందిన జలసూత్రపు సాయితేజతో పరిచయం ఏర్పడి అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలం వీరి అక్రమబంధం కొంతకాలం సాగినతర్వాత వివాహితకు బుద్దివచ్చింది. అక్రమ బంధం గురించి బయటపడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వుంటుందని భయపడిపోయిన విజయలక్ష్మి ప్రియుడు సాయితేజను దూరం పెట్టసాగింది.
అయితే తన ఫోన్ కాల్ కు కూడా విజయలక్ష్మి స్పందించకపోవడంతో కోపంతో రగిలిపోయిన సాయితేజ దారుణానికి ఒడిగట్టాడు. నిన్న(ఆదివారం) విజయలక్ష్మి ఇంటికి వెళ్లి మరీ గొడవకు దిగాడు సాయితేజ. ఈ సమయంలో ఇంట్లో విజయలక్ష్మితో పాటు ఆమె అత్త మాత్రమే వున్నారు.
ఈ క్రమంలో విచక్షణను కోల్పోయిన సాయితేజ తనతో తెచ్చుకున్న కొబ్బరిబోండాల కత్తితో విజయలక్ష్మిపై దాడికి దిగాడు. అరుపులు విని కాపాడేందుకు వచ్చిన ఆమె అత్తపై కూడా దుర్మార్గుడు కత్తితో దాడి చేసాడు. ఇలా ఇద్దరిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి తెగబడి పరారయ్యాడు.
ఈ దాడిలో విజయలక్ష్మి రెండు చేతుల వేళ్ళకు తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆమె అత్తకు కూడా గాయాలయ్యాయి. ఇద్దరినీ చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. అయితే స్వల్పంగానే గాయాలవడంలో ఇద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.
బాధిత వివాహిత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయితేజ కోసం గాలించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడికి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే శారీరక సుఖంకోసం కొందరు వావివరసలు మరిచి సభ్యసమాజం తలదించుకునే అక్రమసంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇలా ఓ వివాహిత బాబాయ్ వరసయ్యే వ్యక్తితో అక్రమసంబంధం పెట్టుకుని ఇందుకు అడ్డుగావున్నాడని కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా హతమార్చిన దారుణం ఖమ్మం జిల్లాలో ఇటీవల వెలుగుచూసింది.
ఖమ్మం పట్టణ సమీపంలోని కుర్నవల్లి మండలకేంద్రంలోని దళితవాడలో ఇనుపనూరి జయరాజు-నిరోషా దంపతులు నివాసముండేవారు. అయితే మద్యానికి బానిసైన జయరాజు కుటుంబ ఆలనాపాలన మరిచి జులాయిగా తిరిగేవాడు. భార్యతో కూడా నిత్యం గొడవపడేవాడు. భర్త తీరుతో విసిగిపోయిన నిరోష మరో వ్యక్తికి దగ్గరయ్యింది. కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన వరసకు బాబాయ్ అయ్యే మాడుగుల కృష్ణతో నిరోషా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. తాగుబోతు భర్త కళ్లుగప్పి బాబాయ్ తో నిరోషా ఏకాంతంగా గడిపేది.
ఇలా ఇటీవల నిరోషా ప్రియుడు కృష్ణతో వుండగా భర్తకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడింది. వీరిద్దని చూడకూడని స్థితిలో చూసిన జయరాజు గొడవ చేయసాగాడు. విషయం బయటపడితే పరువు పోతుందని భావించిన నిరోషా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.